RBI Governor Deepfake: శక్తికాంత దాస్ డీప్‌ఫేక్ వీడియోలు వైరల్.. ప్రజలకు ఆర్‌బీఐ అలర్ట్
భారతదేశం(India)లో ఇటీవల కాలంలో చాలా మంది డీప్‌ఫేక్ వీడియోల(Deepfake Videos) బారిన పడుతున్న విషయం తెలిసిందే.
దిశ, వెబ్‌డెస్క్: భారతదేశం(India)లో ఇటీవల కాలంలో చాలా మంది డీప్‌ఫేక్ వీడియోల(Deepfake Videos) బారిన పడుతున్న విషయం తెలిసిందే. కామన్ పీపుల్(Common People) నుంచి సెలబ్రిటీల(Celebrities) వరకు ఇబ్బంది పెట్టిన ఈ డీప్‌ఫేక్ వ్యవహారం ఇప్పుడు మరోసారి చర్చనీయాంశంగా మారింది. తాజాగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్(RBI Governor) శక్తికాంత దాస్(Shaktikanta Das) కూడా డీప్‌ఫేక్ బారిన పడ్డారు. ఆయన పెట్టుబడి సలహాలు ఇస్తున్నట్లుగా ఉన్న డీప్‌ఫేక్ వీడియోలు సోషల్ మీడియా(Social Media)లో వైరల్ అయ్యాయి.
ఆర్బీఐ త్వరలోనే కొన్ని పెట్టుబడి పథకాలు తీసుకొస్తోందని.. ఈ పథకాల్లో ఇన్వెస్ట్ చేయాలని శక్తికాంత దాస్ చెప్తున్నట్లు కొన్ని వీడియోలు సామజిక మాధ్యమాల్లో సర్క్యూలేట్ అవుతున్నాయి. దీంతో ఆర్‌బీఐ అప్రమత్తమైంది. ఈ వీడియోలకి ఆర్‌బీఐకి ఎలాంటి సంబంధం లేదని, ఆర్‌బీఐ ఎప్పుడూ ఇలాంటి పెట్టుబడి వీడియోలు ప్రచారం చేయదని తెలిపింది. ఇలాంటి ఫేక్ వీడియోల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేసింది. కాగా గతంలో కూడా ఇలాంటి డీప్ ఫేక్ వీడియోలు సోషల్ మీడియాలో హల్ చల్ చేశాయి. నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ ఎండీ&సీఈవో(NSE MD&CEO) ఆశిష్ కుమార్(Ashish Kumar) పేరుతో ఫేక్ వీడియోలు వైరల్ కావడంతో అప్పట్లో ఎన్ఎస్ఈ కూడా ఇన్వెస్టర్లను జాగ్రత్తగా ఉండాలని సూచించింది.