RAMRAJ Cotton: రామ్‌రాజ్ కాటన్ బ్రాండ్ అంబాసిడర్‌గా అభిషేక్ బచ్చన్ నియామకం
ప్రముఖ సాంప్రదాయ దుస్తులు బ్రాండ్ అయిన రామ్‌రాజ్ కాటన్(RAMRAJ Cotton) బ్రాండ్ అంబాసిడర్(Brand Ambassador)గా బాలీవుడ్ నటుడు అభిషేక్ బచ్చన్(Abhishek Bachchan) వ్యవహరించనున్నారు.
దిశ, వెబ్‌డెస్క్: ప్రముఖ సాంప్రదాయ దుస్తుల బ్రాండ్ అయిన రామ్‌రాజ్ కాటన్(RAMRAJ Cotton) బ్రాండ్ అంబాసిడర్(Brand Ambassador)గా బాలీవుడ్ నటుడు అభిషేక్ బచ్చన్(Abhishek Bachchan) వ్యవహరించనున్నారు. ఈ విషయాన్ని సంస్థ ఓ ప్రకటనలో పేర్కొంది. మార్కెట్లో కంపెనీని విస్తరించడానికి, సాంప్రదాయ దుస్తుల విభాగంలో రామ్‌రాజ్ కాటన్ ను బలోపేతం చేయడానికి ఈ నియామకం ఉపయోగపడనుందని కంపెనీ తెలిపింది.
'అభిషేక్ బచ్చన్‌ను రామ్‌రాజ్ కుటుంబంలోకి స్వాగతిస్తున్నందుకు ఆనందంగా ఉంది. దేశవ్యాప్తంగా ప్రజలతో అతనికి ఉన్న అనుబంధం దృష్ట్యా అతన్ని బ్రాండ్ అంబాసిడర్‌గా ఎంపిక చేశాం. ఈ నియమాకంతో మా బిజినెస్ మరింత మందికి చేరువవ్వాలని మేము లక్ష్యంగా పెట్టుకున్నాము' అని రామ్‌రాజ్ కాటన్ ఫౌండర్-చైర్మన్(Founder-Chairman) కెఆర్ నాగరాజన్(KR Nagarajan) అన్నారు. కాగా రామ్‌రాజ్ ప్రచారకర్తగా నియమించడం పట్ల అభిషేక్ బచ్చన్ సంతోషం వ్యక్తం చేశారు. సంస్థతో కలిసి పనిచేసేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్లు తెలిపారు.