డ్యామ్ ఎక్కాలనుకున్నాడు.. దభేలుమని పడ్డాడు! వీడియో వైరల్
ప్రస్తుతం బెంగళూరులోని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. A Man Falls Off Dam Wall During Dangerous Stunt.
దిశ, వెబ్‌డెస్క్ః సాహసాలు చేయొచ్చేమోకానీ, ఓవర్ కాన్ఫిడెన్స్‌తో ప్రవర్తిస్తే మొదలుకే మోసం వస్తుంది. కర్ణాటకలోని చిక్కబళ్లాపూర్‌లోని శ్రీనివాస సాగర డ్యామ్‌ను స్కేల్ చేయడానికి 20 ఏళ్ల యువకుడు ప్రయత్నించాడు. ఈ ప్రమాదకరమైన ప్రయత్నంలో అతను జారిపడిపోయాడు. అజాగ్రత్తగా, అనుమతిలేని ప్రదేశంలో సాహసం చేయబోయి, ఇప్పుడు ఆసుపత్రి పాలయ్యాడు. బెంగళూరు నుండి 74 కి.మీ దూరంలో ఉన్న ఈ డ్యామ్‌పైన నీరు దిగువకు ప్రవహిస్తున్న సమయంలో యువకుడు డ్యామ్ గోడ ఎక్కుతున్నట్లు వీడియోలో కనిపిస్తుంది. అక్కడ నిలబడిన చాలా మంది ఈ ప్రమాదకరమైన ఫీట్‌ని చూస్తుంటారు. దాదాపు 50 అడుగుల ఎత్తు ఉన్న ఆనకట్ట గోడపైన అతను దాదాపు 25 అడుగుల ఎత్తుకు చేరుకున్న తర్వాత, జారిపడతాడు. ఇలా చేయవద్దని జిల్లా యంత్రాంగం హెచ్చరించినా పట్టించుకోకుండా గోడ ఎక్కడానికి ప్రయత్నించిన యువకుడిపై ఇప్పుడు కేసు నమోదైంది. ప్రస్తుతం అతడు బెంగళూరులోని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.
A man fell down the wall of Srinivasa Sagara Dam in #Chikkaballapur and got injured while he was attempting to scale the wall. Reports @dpkBopanna pic.twitter.com/KUpU1NRgyR
— Sanjay Jha (@JhaSanjay07) May 23, 2022