Live-In Relationship Agreement: సహజీవనానికి అగ్రిమెంట్.. వైరల్ గా మారిన కండీషన్లు

అత్యాచారం కేసులో యువతికి ఆమె ప్రియుడు ట్విస్ట్ ఇచ్చాడు.

Update: 2024-09-04 10:47 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: వారిద్దరూ కొంతకాలంగా సహజీవనం చేస్తున్నారు. అంతా హాయిగా సాగుతున్నదనుకున్న సమయంలో ఏం జరిగిందో ఏమో కానీ అనూహ్యంగా ఆ యువతి కోర్టుకెక్కింది. తనను పెళ్లి చేసుకుంటానని సదరు వ్యక్తి మోసం చేయడమే కాకుండా పలు మార్లు అత్యాచారానికి పాల్పడ్డాడంటూ ప్రియుడిపై అభియోగాలు మోపింది. దీంతో అరెస్టు నుంచి తప్పించుకుని ముందస్తు బెయిల్ కోసం సదరు వ్యక్తి లివ్ ఇన్ రిలేషన్ షిప్ అగ్రిమెంట్ ను వెలుగులోకి తీసుకురావడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. కేవలం అగ్రిమెంట్ మాత్రమే కాదు దానిని నోటరీ చేయించడం అందులో వారు రాసుకున్న కండీషన్లు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇంతకీ ఏం జరింగిందంటే.. ముంబయికి చెందిన 29 ఏళ్ల ఓ యువతి వయోధికులకు కేర్ టేకర్ గా పని చేస్తున్నది. అయితే ఆమో ఓ ప్రభుత్వ ఉద్యోగి (46)తో కొంత కాలంగా సహజీవం చేస్తున్నది. అయితే పెళ్లి పేరుతో అతడు తనను మోసం చేశాడని, నాపై అత్యాచారానికి పాల్పడ్డాడంటూ ఇటీవల ముంబై కోర్టులో కేసు వేసింది. అయితే ఆమె వాదన అంతా తప్పు అని తామిద్దరం అగ్రిమెంట్ ప్రకారమే సహజీవం చేస్తున్నామని ‘లైవ్-ఇన్ రిలేషన్ షిప్ అగ్రిమెంట్’ ను తెరపైకి తీసుకువచ్చాడు. మా మధ్య ఇష్టప్రకారమే ఒప్పందం జరిగిందని, ఇప్పుడు కేసు పెడ్డటం అంటే ఇది మోసపూరితం అని ఆయన తరుపున లాయర్ కోర్టులో వాదించారు. అయితే ఆ ఆగ్రిమెంట్ కు తనకు ఎలాంటి సంబంధం లేదని అందులో ఉన్న సంతకం తనది కాదని ఆ యువతి వాదిస్తోంది. ఇదిలా ఉంటే అగ్రిమెంట్ లో ఏడు కండిషన్లు రాసుకోగా అవి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. అయితే ఈ వ్యవహారంలో సదరు వ్యక్తికి కోర్టు బెయిల్ మంజూరు చేసింది.

అగ్రిమెంట్ లోని కండీషన్లు:

*2024 ఆగస్టు 1 నుంచి 2025 జూన్ 30 వరకు సహజీవనంలో కలిసి ఉండాలి.

*ఈ సమయంలో ఒకరిపై మరొకరు లైంగిక వేధింపుల కేసు పెట్టుకోరాదు. శాంతియుతంగా కలిసి కాలక్షేపం చేయాలి.

*సహజీవం సమయంలో మహిళ పురుషుడి ఇంటి వద్దే ఉంటుంది. ఇద్దరిలో అవతలి వ్యక్తి వైఖరి నచ్చకపోతే నెల రోజుల ముందు నోటీస్ పీరియడ్ ఇచ్చిన తర్వాతే విడిపోవాలి.

*సహజీవంలో ఉన్న సమయంలో మహిళ బంధువులు ఆమె ఇంటికి రాకూడదు.

*ఇద్దరి మధ్య ఎలాంటి వేధింపులు, మానసిక ప్రశాంతతకు వాటిల్లకుండా చూసుకోవాలి.

*సహజీవ కాలంలో మహిళ గర్భం దాల్చితే దీనికి అతడు బాధ్యత వహించడు

*ఈ సమయంలో వేధింపులు మానసిక క్షోభ కలిగించడం ద్వారా పురుషుడి జీవితాన్ని నాశనం చేస్తే ఆ బాధ్యత సదరు మహిళనే భరించాల్సి ఉంటుంది.


Similar News