లింగ సమానత్వం కోసం ఢిల్లీ యూనివర్సిటీ కీలక నిర్ణయం.. డీయూలో సింగిల్ గర్ల్ చైల్డ్ కోటా

Update: 2024-05-29 11:19 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: లింగ సమానత్వాన్ని ప్రోత్సహించేందుకు ఢిల్లీ విశ్వవిద్యాలయం కీలక నిర్ణయం తీసుకుంది. గత సంవత్సరం అనాథ విద్యార్ధుల కోసం సూపర్ న్యూమరీ కేటగిరీని తెచ్చిన యూనివర్సిటీ ఈ ఏడాది అండర్ గ్రాడ్యూయేట్ కోర్సులలో సింగిల్ గర్ల్ చైల్డ్ కోటాను ప్రవేశపెడుతున్నట్లు ప్రకటించింది. ఢిల్లీ యూనివర్సిటీ 2024- 2025 అడ్మిషన్ల కోసం సీఎస్ఏఎస్ పోర్టల్ ను ఒక నెల పాటు అందుబాటులో ఉంచనుంది. ఒక ముఖ్యమైన చర్యలో భాగంగా లింగ సమానత్వాన్ని ప్రోత్సహించడానికి ఈ విద్యాసంవత్సరం నుండి తన అన్ని కార్యక్రమాలలో ఒక బాలిక పిల్లల కోటాను ప్రవేశ పెడుతున్నట్లు ప్రకటించింది.

అండర్ గ్రాడ్యుయేట్ కోర్సుల ప్రవేశ ప్రక్రియను ప్రారంభించిన సందర్భంగా ఈ ప్రకటన చేశారు. మొత్తం 69 కళాశాలల్లో 71,000 సీట్లను ఆఫర్ చేస్తూ అండర్ గ్రాడ్యుయేట్ అడ్మిషన్ల కోసం కామన్ సీట్ అలొకేషన్ సిస్టమ్ (సీఎస్ఏఎస్) ను ప్రారంభించినట్లు అధికారులు వెల్లడించారు. ఈ సంవత్సరం ప్రవేశ ప్రక్రియకు సంబందించి సూపర్ న్యూమరీ సీట్లలో భాగంగా అన్ని ప్రోగ్రామ్ లలో ఒంటరి బాలికలకు కొత్తగా ప్రవేశపెట్టిన రిజర్వేషన్లు మినహా అడ్మిషన్ ప్రక్రియలో పెద్దగా మార్పులు లేవని డీయూ రిజిస్ట్రార్ వికాస్ గుప్తా ధృవీకరించారు. కాగా గతసంవత్సరం అనాథ విద్యార్ధుల కోసం సూపర్ న్యూమరీ కేటగిరీని ప్రవేశపెట్టింది. ఈ కోటా ప్రకారం ప్రతీ ప్రోగ్రామ్ లో అనాథలైన ఒక పురుషుడు, ఒక మహిళకు ప్రత్యేక సీట్లు కేటాయించింది.  


Similar News