ఎయిర్ హోస్టెస్ ఆ పిల్లాణ్ని ఎత్తుకొని ఇలా..?! ఎంత ప్రేమ!!

Update: 2022-03-05 08:20 GMT

దిశ‌, వెబ్‌డెస్క్ః ఎయిర్ హోస్టెస్ పేరులోనే సామాన్యుల‌కు ఓ హుందాత‌నం క‌నిపిస్తుంది. నీట్‌గా, అఫీయ‌ల్ లుక్‌తో ఆక‌ర్ష‌ణీయంగా ఉంటారు. కానీ, వారిలో అమ్మత‌నం కూడా ఎంతో ఉంటుంది. అందుకే, విమానంలో ఎవ్వ‌రికి ఎలాంటి అవ‌స‌రం వ‌చ్చిన న‌వ్వుతూ స్పందిస్తారు. సాధ్య‌మైనంత వ‌ర‌కూ ప్యాసింజ‌ర్ల‌ను సౌక‌ర్యంగా ఉంచ‌డానికి ప్ర‌య‌త్నిస్తారు. ఈ బ్రిటీష్ ఎయిర్‌వేస్‌కు చెందిన‌ ఫ్లైట్ అటెండెంట్ కూడా స‌రిగ్గా అలాంటి స‌హాయ‌మే చేసింది. ఇప్పుడు ఇంటర్నెట్‌లో ఎంద‌రో మ‌న‌సుల‌ను గెలుచుకుంది. ఇంత‌కీ ఆమె చేసిందంటే ఫ్లైట్‌లో ఓ పసిబిడ్డ గుక్క తిప్పుకోకుండా ఏడుస్తుంటే ఆ చిన్నారిని తన చేతుల్లోకి తీసుకుని ఊర‌డించింది. హాయిగా నిద్రపుచ్చింది. ఇటీవల బ్రెజిల్ నుంచి బ్రెసిలియా- కుయాబా మధ్య న‌డిచే విమానంలో ఈ సంఘ‌ట‌న‌ జరిగింది. ఈ వీడియో ఇప్పుడు నెట్‌లో వైరల్ అవుతోంది. గుడ్ న్యూస్ మూవ్‌మెంట్ ఇన్‌స్టాగ్రామ్ పేజీలో షేర్ చేయగా నెటిజ‌న్లు ఆమెను ప్ర‌శంసిస్తున్నారు. ఏడుస్తున్న పిల్లాడికి ఆడుకోవ‌డానిక‌ని కొన్ని బొమ్మ‌లు ఇచ్చినా ఏడుస్తూనే ఉండ‌టంతో ఆమె ఇలా చేసిందని ఈ పోస్ట్‌లో సంఘ‌ట‌న‌ను వివ‌రించారు. 

Tags:    

Similar News