Manipur: ఉగ్రకుట్ర భగ్నం.. 7 ఐఈడీలు నిర్వీర్యం

మణిపూర్(Manipur) లో భారీ ఉగ్రకుట్రను అధికారులు భగ్నం చేశారు. 7 ఇంప్రూవైజ్డ్ ఎక్స్ ప్రోజివ్ డివైజ్ లు(IED), ఒక డిటోనేటర్ ను నిర్వీర్యం అయ్యాయి.

Update: 2024-07-21 04:58 GMT

దిశ, నేషనల్ బ్యూరో : మణిపూర్(Manipur) లో భారీ ఉగ్రకుట్రను అధికారులు భగ్నం చేశారు. ఆర్మీ(Army), మణిపూర్ పోలీసులు సంయుక్త ఆపరేషన్ లో 7 ఇంప్రూవైజ్డ్ ఎక్స్ ప్రోజివ్ డివైజ్ లు(IED), ఒక డిటోనేటర్ ను  నిర్వీర్యం చేసింది. తూర్పు ఇంఫాల్ జిల్లాలోని సైచాంగ్ ఇథమ్ ప్రాంతంలో వీటిని స్వాధీనం చేసుకున్నారు. బాంబు డిస్పోజల్ టీంతో పాటు ఆర్మీ బృందం 33 కిలోల బరువున్న ఐఈడీని నిర్వీర్యం చేసింది. వేగంగా స్పందించడం వల్లే పెద్ద దాడులను నివారించామని అధికారులు పేర్కొన్నారు.భద్రతా దళాలు, ప్రయాణీకులను లక్ష్యంగా చేసుకున్న ప్లాన్ పటాపంచలు అయ్యింది. ఈ ప్రాంతంలో ఇంఫాల్ తూర్పులోని మొయిరంగ్‌పురేల్, ఇథమ్ గ్రామాల్లోని రైతులు, పశువుల కాపరులు విస్తృతంగా తిరుగుతారు.

జాయింట్ ఆపరేషన్

మోయిరంగ్‌పురేల్, ఇథమ్ గ్రామల్లో రైతలు పనిచేసేచోట ఐఈడీలను కనుగొన్నామని ఇంఫాల్ పోలీసులు ప్రకటనలో పేర్కొన్నారు. ఈ ప్రాంతంలో విధ్వంసక కార్యకలాపాలను చేపట్టాలని యోచిస్తున్న విద్వేషపూరిత వ్యక్తుల చర్యను దెబ్బతీశామన్నారు. ఇకపోతే, బుధవారం కూడా సైన్యం, పోలీసుల జాయింట్ ఆపరేషన్ లో భారీగా ఆయుధాలు, మందుసామగ్రి స్వాధీనం చేసుకున్నట్లు రక్షణమంత్రిత్వ శాఖ వెల్లడించింది. కాంగ్ పోక్పి, తూర్పు ఇంఫల్ ప్రాంతాల్లో విస్తృతమైన ఆపరేషన్ చేపట్టినట్లు తెలిపింది. 72 గంటల సుదీర్ఘ ఆపరేషన్ లో 13 దీర్ఘశ్రేణి మోర్టార్లు, 4 బర్మీస్ 'ఐరన్ రాడ్', ఒక ఐఈడీ, గ్రెనైడ్ లాంఛర్ సహా పెద్దసంఖ్యలో ఆయుధాలు, మందుగుండు సామగ్రి స్వాధీనం చేసుకున్నారు.


Similar News