2014-2023 మధ్య ఎన్డీఏ హయాంలో 638 రైలు ప్రమాదాలు

పరిస్థితులు 2004-2014లో యూపీఏ, 2014 నుంచి ఎన్డీఏ మధ్య ఏ ప్రభుత్వాలు రైల్వేలను మెరుగ్గా నిర్వహించాయనే చర్చకు తెరలేపాయి.

Update: 2024-06-18 17:30 GMT

దిశ, నేషనల్ బ్యూరో: పశ్చిమ బెంగాల్‌లోని కాంచన్ జంగా ఎక్స్‌ప్రెస్‌ను గూడ్స్ రైలు ఢీకొన్న ఘోరమైన ప్రమాదంలో 10 మంది మృతి చెందారు. పదుల సంఖ్యలో క్షతగాత్రులు చికిత్స పొందుతున్నారు. ఈ ఘటన దేశవ్యాప్తంగా పెద్ద రాజకీయ దుమారాన్ని రేపింది. కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ రాజీనామా చేయాలని పలువురు ప్రతిపక్ష నేతలు డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు గడిచిన పదేళ్ల కాలంలో జరిగిన రైలు ప్రమాద డేటాను బహిర్గతం అవుతున్నాయి. ఎన్డీఏ హయాంలో రైలు ప్రమాదాలు గణనీయంగా పెరిగాయని, వందల సంఖ్యలో ఘటనలు జరిగాయని ప్రధాన ప్రతిపక్షం కాగ్రెస్ ఆరోపణలు చేస్తోంది. అంతేకాకుండా వేల సంఖ్యలో ప్రయాణికులు విగతజీవులుగా మారారాని, అందుకు ప్రధాని నరేంద్ర మోడీ ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణమని విమర్శలు పెంచాయి. ఈ నేపథ్యంలో పరిస్థితులు 2004-2014లో యూపీఏ, 2014 నుంచి ఎన్డీఏ మధ్య ఏ ప్రభుత్వాలు రైల్వేలను మెరుగ్గా నిర్వహించాయనే చర్చకు తెరలేపాయి. గణాంకాల ప్రకారం, 2004 నుంచి 2014 వరకు మొత్తం 1,711 రైల్వే ప్రమాదాలు జరిగాయి. అయితే, 2014 నుంచి 2023, మార్చి వరకు, బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ హయామలో ఈ ప్రమాదాల సంఖ్య 638గా నమోదయ్యాయి. యూపీ పాలనలో మొత్తం 2,453 మంది మృతి చెందగా, 4,486 మంది గాయపడ్డారు. మొత్తం ప్రమాదాల్లో 867 పట్టాలు తప్పడం వల్ల జరగ్గా, ట్రాక్‌ల పునరుద్ధరణకు ఏటా రూ.4,702 కోట్లు ఖర్చయింది. ఎన్డీఏ హయాంలో 638 రైలు ప్రమాదాలు జరిగితే, 781 మంది మరణించారు. 1,543 మంది గాయపడ్డారు. 426 రైళ్లు పట్టాలు తప్పగా, ట్రాక్‌ల పునరుద్ధరణకు ఏటా రూ. 10,201 కోట్లు ఖర్చయ్యాయి.

Similar News