Karnataka: కర్ణాటకలో డెలివరీ తర్వాత ఆరుగురు మృతి.. దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన ఆరోగ్యమంత్రి

కర్ణాటకలోని(Karnataka) ప్రభుత్వ ఆస్పత్రిలో డెలివరీ(Women Die Post Delivery) తర్వాత ఆరుగురు మహిళలు మరణించారు.

Update: 2024-12-06 11:16 GMT

దిశ, నేషనల్ బ్యూరో: కర్ణాటకలోని(Karnataka) ప్రభుత్వ ఆస్పత్రిలో డెలివరీ(Women Die Post Delivery) తర్వాత ఆరుగురు మహిళలు మరణించారు. బళ్లారిలోని(Ballari district) విజయనగర ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (WIMS)లో సిజేరియన్ సర్జరీ తర్వాత వీరంతా చనిపోయారు. విమ్స్ లో డెలివరీ కోసం 25 ఏళ్ల సుమయ నవంబర్ 10న అడ్మిట్‌ అయ్యింది. నవంబర్ 12న ఆమెకు సిజేరియన్ ఆపరేషన్‌ చేశారు. కాగా, ఆపరేషన్ తర్వాత సుమయకు ఐవీ ఫ్లూయిడ్స్ ఇచ్చారు. అయితే, వాటిద్వారా ఆమెకు కిడ్నీ సమస్యలతో పాటు శరీరంలోని అన్ని అవయవాల వైఫల్యానికి దారితీసింది. డయాలసిస్ చేయించుకుంటున్న సుమయ డిసెంబర్ 5న మరణించింది. అంతకు ముందు రోజమ్మ, నందిని, ముస్కాన్, మహాలక్ష్మి, లలితమ్మ అనే మహిళలు కూడా డెలివరీ తర్వాత సమస్యల వల్ల మరణించారు. దీంతో ఈ సంఘటనలపై ఆ కర్ణాటక వ్యాప్తంగా తీవ్ర ఆందోళనలు వ్యక్తమయ్యాయి.

కర్ణాటక మంత్రి దిగ్భ్రాంతి

మరోవైపు, కర్ణాటక ఆరోగ్య మంత్రి దినేష్ గుండురావు(Karnataka Health Minister) ఈ ఘటనలపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఇలాంటి పరిణామాలను ప్రజలు సహించరాదని, నిరసనలు చేపట్టాలని అన్నారు. బాధితులకు ప్రభుత్వం ఇప్పటికే నష్టపరిహారం ప్రకటించిందని తెలిపారు. ఇకపై, ఎలాంటి మరణాలు సంభవించకుండా చూస్తామని హామీ ఇచ్చారు. కాగా, నిర్లక్ష్యం వహించిన వారితోపాటు బాధ్యులపై చర్యలు చేపడతామని ఆరోగ్య మంత్రి దినేష్ గుండురావు తెలిపారు. వీరి మరణాలకు ఐవీ ఫ్లూయిడ్స్ కారణమని ల్యాబ్‌ పరీక్షలో తేలిందన్నారు. కాగా.. వాటిని సరఫరా చేసిన బెంగాల్‌ ఫార్మా కంపెనీపై చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. అలాగే, కర్ణాటక రాష్ట్ర డ్రగ్ కంట్రోలర్‌ను సస్పెండ్‌ చేసినట్లు వెల్లడించారు.

Tags:    

Similar News