Union Carbide toxic waste: భోపాల్ గ్యాస్ ప్రమాదం.. 40 ఏళ్ల తర్వాత వ్యర్థాల తరలింపు
భోపాల్ గ్యాస్ ప్రమాదం జరిగిన 40 ఏళ్ల తర్వాత వ్యర్థాల తరలింపు జరుగుతోంది. యూనియన్ కార్బైడ్ సంస్థ ఆవరణలో పడివున్న 377 టన్నుల విషపదార్థాలు (Union Carbide toxic waste) తరలిస్తున్నారు.
దిశ, నేషనల్ బ్యూరో: భోపాల్ గ్యాస్ ప్రమాదం జరిగిన 40 ఏళ్ల తర్వాత వ్యర్థాల తరలింపు జరుగుతోంది. యూనియన్ కార్బైడ్ సంస్థ ఆవరణలో పడివున్న 377 టన్నుల విషపదార్థాలు (Union Carbide toxic waste) తరలిస్తున్నారు. ఆదివారం జీపీఎస్ అమర్చిన అరడజను ట్రక్కులు, అత్యంత పకడ్బందీగా తయారుచేసిన కంటైనర్లు అక్కడికి చేరుకొన్నాయి. మరోవైపు పీపీఈ కిట్లు ధరించిన సిబ్బంది, మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు, డాక్టర్లు, నిపుణులు ఘటనాస్థలికి చేరుకున్నారు. ఫ్యాక్టరీ ఆవరణలో పోలీసు బలగాలను మోహరించారు. వీటిని ఇండోర్ సమీపంలోని పీతంపుర్ ప్రాంతానికి తరలించనున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి.
వ్యర్థాల తరలింపులో జాప్యం
ఇకపోతే, వ్యర్థాల తరలింపులో జాప్యంపై భోపాల్ అధికారులకు హైకోర్టు మొట్టికాయలు వేసింది. కోర్టు ధిక్కార నేరం కింద కేసులు నమోదు చేయిస్తామని అధికారులు హెచ్చరించారు. దీంతో, కోర్టు కూడా వీటిని తరలించేందుకు నాలుగువారాల డెడ్ లైన్ విధించింది. దీంతో, అధికారులు చర్యలు చేపట్టారు. వ్యర్థాలను సురక్షితంగా పీతంపుర్‌కు తరలించనున్నట్లు రాష్ట్ర గ్యాస్ రిలీఫ్ అండ్ రిహాబిలిటేషన్ డిపార్ట్‌మెంట్ డైరెక్టర్ స్వతంత్రకుమార్ సింగ్ వెల్లడించారు. ఈక్రమంలో వీలైనంత వేగంగా వ్యర్థాలను తరలించేందుకు గ్రీన్ కారిడార్ ఏర్పాటుచేశామన్నారు. అక్కడి డిస్పోజల్ యూనిట్‌లో తొలుత కొంత మొత్తాన్ని ప్రత్యేకంగా దహనం చేస్తామని వెల్లడిచారు. తర్వాత వచ్చే బూడిదలో కూడా ఏమైనా రసాయనాలు ఉన్నాయేమో శాస్త్రీయంగా పరీక్షలు జరుపుతామన్నారు.