ఆ పార్టీల నుంచి కాంగ్రెస్‌లోకి 40 మంది కీలక నేతలు : DK Shivakumar

కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

Update: 2023-10-12 13:23 GMT

బెంగళూరు : కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. బీజేపీ, జేడీఎస్ మధ్య కుదిరిన అపవిత్ర పొత్తును వ్యతిరేకిస్తున్న దాదాపు 40 మందికిపైగా ఆయా పార్టీల నేతలు కాంగ్రెస్‌లో చేరేందుకు సుముఖంగా ఉన్నారని ఆయన ప్రకటించారు. అసెంబ్లీ ఎన్నికల్లో శిరహట్టి సెగ్మెంట్ నుంచి బీజేపీ టికెట్‌ను ఆశించి భంగపడిన మాజీ ఎమ్మెల్యే రామప్ప లమాని ఇటీవల కాంగ్రెస్‌లో చేరిన నేపథ్యంలో డీకే శివకుమార్ గురువారం ఈ కామెంట్స్ చేశారు. ‘‘40 మందికి పైగా బీజేపీ, జేడీఎస్ లీడర్ల నుంచి వచ్చిన అప్లికేషన్లు నా ముందు ఉన్నాయి.

నేను ఈ సమాచారాన్ని వెల్లడించాలని ఎప్పుడూ అనుకోలేదు. కానీ ఇప్పుడు పరిస్థితి వచ్చింది కాబట్టి చెబుతున్నాను’’ అని ఆయన తెలిపారు. ఈవిధంగా ఆసక్తి చూపుతున్న లీడర్లను.. స్థానికంగా ఉండే కాంగ్రెస్ నేతలతో చర్చించాక ఒక్కొక్కరిగా పార్టీలోకి చేర్చుకుంటున్నట్లు శివకుమార్ చెప్పారు. ఉత్తరాన బీదర్‌ నుంచి దక్షిణాదిన చామరాజనగర్‌ వరకు చాలా అసెంబ్లీ స్థానాలకు చెందిన నేతలు హస్తం పార్టీలోకి వచ్చేందుకు రెడీగా ఉన్నారని పేర్కొన్నారు. వారంతా చేరితే కాంగ్రెస్ కు, కర్ణాటకకు ప్రయోజనం చేకూరుతుందన్నారు. ఆప్ నుంచి కూడా వందమందికిపైగా కాంగ్రెస్‌లోకి చేరేందుకు సమాయత్తం అయ్యారని వివరించారు.


Similar News