Ratan Tata: రతన్ టాటాకు తీవ్ర అస్వస్థత.. క్లారిటీ ఇదిగో

టాటా గ్రూప్ చైర్మన్ రతన్ టాటా అస్వస్థతకు గురయ్యారన్న వార్తలు నెట్టింట వైరల్ అయ్యాయి. అయితే ఆ వార్తలు ఫేక్ అని ఆయన ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు.

Update: 2024-10-07 07:14 GMT

దిశ, వెబ్ డెస్క్: ప్రముఖ పారిశ్రామిక వేత్త, టాటా సన్స్ అధినేత రతన్ టాటా (Ratan Naval Tata) తీవ్ర అస్వస్థతకు గురయ్యారన్న వార్తలు గుప్పుమన్నాయి.. కుటుంబ సభ్యులు ఆయన్ను ముంబైలోని బ్రీచ్ క్యాండీ ఆస్పత్రికి తరలించారని, ఆయనకు బీపీ డౌన్ అయిందన్న వార్తలు, పోస్టులు నెట్టింట వైరల్ అయ్యాయి. ఆదివారం అర్థరాత్రి 12.30 గంటల నుంచి 1 గంట మధ్యలో ఆయన్ను ఆస్పత్రిలో చేర్చారని, ప్రస్తుతం ఆయనకు నిపుణుల వైద్య బృందం ఐసీయూలో చికిత్స అందిస్తోందని, మెడికల్ టీమ్ ఎప్పటికప్పుడు టాటా ఆరోగ్య పరిస్థితిని గమనిస్తోందని వార్తలొచ్చాయి.

దీనిపై రతన్ టాటా ఎక్స్ వేదికగా స్పందించారు. తన ఆరోగ్యం బాగానే ఉందని, తన ఆరోగ్యం బాలేదని వస్తున్న వార్తలన్నీ అవాస్తవమని ఆ పోస్ట్ లో పేర్కొన్నారు. వయస్సు దృష్ట్యా కొన్ని ఆరోగ్య పరీక్షలు చేయించుకుంటున్నానని స్పష్టం చేశారు. తన ఆరోగ్యం విషమించిందన్న వార్తలు నమ్మొద్దని తెలిపారు. ఇలాంటి అవాస్తవ వార్తలతో ప్రజలను ఆందోళనకు గురిచేయవద్దని విజ్ఞప్తి చేశారు.


Similar News