అజిత్ పవార్ వర్గానికి షాక్.. పార్టీని వీడిని నలుగురు కీలక నేతలు

మహారాష్ట్రలో అజిత్ పవార్ నేతృత్వంలోని నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీకి(ఎన్సీపీ) షాక్ తగిలింది. పింప్రీ చించ్వాడ్ లో అజిత్ పవార్ వర్గానికి చెందిన నలుగురు అగ్రనేతలు రాజీనామా చేశారు.

Update: 2024-07-17 03:52 GMT

దిశ, నేషనల్ బ్యూరో: మహారాష్ట్రలో అజిత్ పవార్ నేతృత్వంలోని నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీకి(ఎన్సీపీ) షాక్ తగిలింది. పింప్రీ చించ్వాడ్ లో అజిత్ పవార్ వర్గానికి చెందిన నలుగురు అగ్రనేతలు రాజీనామా చేశారు. ఇటీవల జరిగిన లోక్ సభ ఎన్నికల్లో పేలవమైన ప్రదర్శనతో ఈ అనూహ్యన నిర్ణయం తీసుకున్నారు. దీంతో అజిత్ పవార్ వర్గానికి ఎదురుదెబ్బ తగిలింది. వీరంతా ఈ వారంలోనే శరద్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీలో చేరే అవకాశం ఉంది. పింప్రి-చించ్వాడ్ యూనిట్ చీఫ్ అజిత్ గవానే పింప్రీ చించ్వాడ్ స్టూడెంట్స్ వింగ్ చీఫ్ యశ్ సానే, మాజీ కార్పొరేటర్లు, రాహుల్ భోసలే, పంకజ్ భలేకర్ పార్టీకి రాజీనామా చేశారు. అజిత్ పవార్ శిబిరంలోని కొందరు నేతలు తిరిగి శరద్ పవార్ గూటికి చేరేందుకు సిద్ధమవుతున్నారనే ఊహాగానాల మధ్య ఈ రాజీనామాలు జరిగాయి.

శరద్ పవార్ పై అజిత్ తిరుగుబాటు

2023లో అజిత్ పవార్.. ఎన్సీపీ వ్యవస్థాపకుడు శరద్ పవార్‌పై తిరుగుబాటు చేయడంతో పవార్ కుటుంబం రెండు రాజకీయ పార్టీలుగా విడిపోయింది. శరద్ పవార్ ప్రతిపక్ష శిబిరంలో ఉండగా, అజిత్ పవార్ ముఖ్యమంత్రి ఎక్ నాథ్ షిండే నేతృత్వంలోని మహాయుతి ప్రభుత్వంలో చేరారు. దీంతో డిప్యూటీ సీఎంగా మారారు. అజిత్ పవార్ పార్టీ బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏలో భాగంగా లోక్‌సభ ఎన్నికలలో పోటీ చేసింది. లోక్ సభ ఎన్నికల్లో కేవలం ఒక సీటు మాత్రమే గెలుచుకుందిం. కానీ శరద్ పవార్ ఎన్సీపీ మాత్రం 8 స్థానాల్లో గెలిచింది.


Similar News