లక్షకు చేరువలో కరోనా కేసులు..
భారత్‌లో కరోనా కేసులు చాపకింద నీరులా పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 12,193 కొత్త కోవిడ్-19 కేసులు నమోదైనట్లు ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ డేటా వెల్లడించింది.
దిశ, వెబ్‌డెస్క్: భారత్‌లో కరోనా కేసులు చాపకింద నీరులా పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 12,193 కొత్త కోవిడ్-19 కేసులు నమోదైనట్లు ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ డేటా వెల్లడించింది. దీంతో భారత్ లో కరోనా యాక్టివ్ కేసుల సంఖ్య 67,556 కి చేరుకుంది. అలాగే గడిచిన 24 గంటల్లో 42 మరణాలు నమోదయ్యాయి. దీంతో భారత్‌లో ఇప్పటి వరకు కరోనాతో మృతిచెందిన వారి సంఖ్య 42 మరణాలు నమోదు చేరింది. అలాగే..10,765 రికవరీలతో, మొత్తం రికవరీల సంఖ్య 4,42,83,021కి చేరుకుంది.