హీట్ వేవ్ వల్ల 110 మంది మృతి.. 40 వేల వడదెబ్బ కేసులు

ఈ ఏడాది మార్చి 1 నుంచి జూన్ 18 మధ్య దేశంలో ఏకంగా 100 మంది ప్రాణాలు కోల్పోయారు.

Update: 2024-06-20 10:30 GMT

దిశ, నేషనల్ బ్యూరో: అధిక ఉష్ణోగ్రతల కారణంగా ఉత్తరాదితో పాటు ఈశాన్య రాష్ట్రాలు అగ్నిగుండాలుగా మారాయి. ఈ ఏడాది మార్చి 1 నుంచి జూన్ 18 మధ్య దేశంలో ఏకంగా 100 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 40 వేల వడదెబ్బ కేసులు నమోదయ్యాయని కేంద్ర ఆరోగ్య శాఖ వర్గాలు వెల్లడించాయి. నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్(ఎన్‌సీడీసీ) సేకరించిన డేటా ప్రకారం, ఉత్తరప్రదేశ్‌లో మాత్రమే 36 మరణాలు సంభవించగా, ఆ తర్వాత బీహార్, రాజస్థాన్, ఒడిశాలలో పదుల సంఖ్యలో మృత్యువాత పడ్డారు. దేశ రాజధాని ఢిల్లీలో ఉష్ణోగ్రతలు 50 డిగ్రీల పైనే నమోదవుతోంది. దీంతో జూన్ 11 నుంచి 19 మధ్య వడదెబ్బతో 192 మంది నిరాశ్రయులు మృతి చెందారని ఓ స్వచ్చంధ సంస్థ పేర్కొంది. అయితే, ఈ గణాంకాలు రాష్ట్రాల నుంచి అందిన తుది సంఖ్యలు కాదు, కాబట్టి మరణాల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని అధికార వర్గాలు వెల్లడించాయి. జూన్ 18న ఒక్కరోజే వడదెబ్బ కారణంగా ఆరుగురు మరణించారని డేటా చెబుతోంది. అధిక వేడి కారణంగా మరణాలు పెరుగుతున్న నేపథ్యంలో వడదెబ్బ బారిన పడిన వారి కోసం ప్రత్యేక విభాగాలు ఏర్పాటు చేయాలని ఆసుపత్రులకు కేంద్రం సూచించింది. 


Similar News