Odisha: ఆహారంలో బల్లి.. వందిమంది విద్యార్థులకు అస్వస్థత

ఒడిశాలో బాలాసోర్ జిల్లాలోని ఓ పాఠశాలకు చెందిన సుమారు వంద మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు.

Update: 2024-08-09 06:11 GMT

దిశ, నేషనల్ బ్యూరో: ఒడిశాలో బాలాసోర్ జిల్లాలోని ఓ పాఠశాలకు చెందిన సుమారు వంద మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. గురువారం మధ్యాహ్నం భోజన పథకం కింద పంపిణీ చేసిన ఆహారం తిన్న స్టూడెంట్స్ అనారోగ్యం పాలయ్యారు. సిరాపూర్ గ్రామంలోని ఉదయనారాయణ్ నోడల్ స్కూల్‌లోని విద్యార్థులకు మధ్యాహ్న భోజనంలో భాగంగా ఆహారం వడ్డించారు. కొద్దిసేపటి తర్వాత ఒక విద్యార్థి ఆహారంలో బల్లిని గుర్తించాడు. దీంతో, పాఠశాలలోని టీచర్లు భోజనం పంపిణీని నిలిపివేశారు. ఆ ఆహారం తిన్న చాలా మంది విద్యార్థులకు కడుపు నొప్పి, ఛాతినొప్పి లక్షణాలు కన్పించాయి. ఆ తర్వాత వారిని అంబులెన్స్ లు, ఇతర ప్రైవేటు వాహనాల్లో సమీపంలోని సామాజిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు.

విచారణ చేపట్టిన అధికారులు

విద్యార్థులకు స్కూల్ లోనే ట్రీట్మెంట్ అందించేందుకు వైద్య బృందం అక్కడికి చేరుకుంది. స్వల్పలక్షణాలు ఉన్న కొందరికి అక్కడే వైద్యులు ప్రాథమిక చికిత్స చేశారు. ఆ తర్వాత కూడా పలువురు విద్యార్థులు వాంతులు చేసుకోవడంతో వారిని ఆస్పత్రికి తరలించారు. కాగా, ఈ ఘటనపై విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని బ్లాక్ ఎడ్యుకేషన్ అధికారి తెలిపారు. బాధ్యులపైన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.


Similar News