బడ్జెట్ 2024: 100 భారత పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ శాఖలను ప్రకటించిన కేంద్రం

2024-25 కేంద్ర బడ్జెట్‌లో నార్త్ ఈస్ట్‌లోని 100 భారత పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ (IPPB) శాఖలను ఏర్పాటు చేయనున్నట్లు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు.

Update: 2024-07-23 06:48 GMT

దిశ, వెబ్ డెస్క్: 2024-25 కేంద్ర బడ్జెట్‌లో నార్త్ ఈస్ట్‌లోని 100 భారత పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ (IPPB) శాఖలను ఏర్పాటు చేయనున్నట్లు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. ఈశాన్య ప్రాంత బ్యాంకింగ్ వ్యవస్థను బలోపేతం చేసేందుకు గాను 2024 బడ్జెట్‌లో ఆర్దిక మంత్రి ఈ భారీ ప్రకటనలు చేశారు. కాగా దేశవ్యాప్తంగా IPPB ప్రస్తుతం కోట్లాది ఖాతాలు కలిగి ఉంది. తాజాగా ప్రభుత్వ నిర్ణయంతో నార్త్ ఈస్ట్‌ ప్రాంత ప్రజలకు బ్యాంకింగ్ సేవలు అందుబాటులోకి రానున్నాయి. దీంతో వారికి ప్రభుత్వాల నుంచి వచ్చే సదుపాయాలు, పథకాలకు సంబంధించిన మొత్తం నేరుగా అందే అవకాశం ఉంది.


Similar News