కొండచరియలు విరిగిపడి జాతీయ రహదారి బంద్

దిశ, వెబ్‌డెస్క్: కొండచరియలు విరిగిపడి ఏకంగా జాతీయ రహదారిపై రాకపోకలు బంద్ అయ్యాయి. ఈ ఘటన ఉత్తరాఖండ్‌లోని చంపావత్ జిల్లా స్వాలాలో చోటుచేసుకుంది. తనక్‌పూర్-చంపావత్ మార్గమధ్యలో స్వాలా సమీపంలో జాతీయ రహదారికి ఆనుకొని ఉన్న కొండచరియలు భారీ వర్షాలు, వరదల ప్రభావంతో ఒక్కసారి విరిగిపడ్డాయి. దీంతో జాతీయ రహదారి పూర్తిగా దిగ్బంధం అయింది. ఇదే సమయంలో అటుగా వెళ్తున్న వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. రోడ్డు క్లియర్ ఎప్పుడు చేస్తారని అధికారులను సంప్రదించగా మరో రెండ్రోజుల సమయం […]

Update: 2021-08-23 09:24 GMT

దిశ, వెబ్‌డెస్క్: కొండచరియలు విరిగిపడి ఏకంగా జాతీయ రహదారిపై రాకపోకలు బంద్ అయ్యాయి. ఈ ఘటన ఉత్తరాఖండ్‌లోని చంపావత్ జిల్లా స్వాలాలో చోటుచేసుకుంది. తనక్‌పూర్-చంపావత్ మార్గమధ్యలో స్వాలా సమీపంలో జాతీయ రహదారికి ఆనుకొని ఉన్న కొండచరియలు భారీ వర్షాలు, వరదల ప్రభావంతో ఒక్కసారి విరిగిపడ్డాయి. దీంతో జాతీయ రహదారి పూర్తిగా దిగ్బంధం అయింది. ఇదే సమయంలో అటుగా వెళ్తున్న వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. రోడ్డు క్లియర్ ఎప్పుడు చేస్తారని అధికారులను సంప్రదించగా మరో రెండ్రోజుల సమయం పడుతుందని చెప్పడంతో తీవ్ర నిరూత్సాహానికి లోనయ్యారు.

Tags:    

Similar News