ఆస్ట్రేలియాలో అరంగేట్రం చేస్తానని అనుకోలేదు : నటరాజన్

దిశ, స్పోర్ట్స్: ఆస్ట్రేలియా పర్యటనకు నెట్ బౌలర్‌గా వెళ్లి మూడు ఫార్మాట్లలో అరంగేట్రం చేసిన తంగరసు నటరాజన్ ఇప్పటికీ తనకు దక్కిన అవకాశాలను నమ్మలేక పోతున్నాడంటా. భారత జట్టు తరపున ఆడే అవకాశం ఆస్ట్రేలియాలోనే తనకు కలుగుతుందని అసలు ఊహించలేదని.. భారత జట్టు జెర్సీలో తొలి మ్యాచ్ ఆడుతున్నప్పుడు చాలా ఒత్తిడికి గురయ్యానని నటరాజన్ అంటున్నాడు. నటరాజన్ తన తొలి అంతర్జాతీయ వన్డే మ్యాచ్ డిసెంబ్ 2న కాన్‌బెర్రాలో ఆడాడు. ఆ సమయంలో తన మానసిక స్థితి […]

Update: 2021-01-24 09:37 GMT

దిశ, స్పోర్ట్స్: ఆస్ట్రేలియా పర్యటనకు నెట్ బౌలర్‌గా వెళ్లి మూడు ఫార్మాట్లలో అరంగేట్రం చేసిన తంగరసు నటరాజన్ ఇప్పటికీ తనకు దక్కిన అవకాశాలను నమ్మలేక పోతున్నాడంటా. భారత జట్టు తరపున ఆడే అవకాశం ఆస్ట్రేలియాలోనే తనకు కలుగుతుందని అసలు ఊహించలేదని.. భారత జట్టు జెర్సీలో తొలి మ్యాచ్ ఆడుతున్నప్పుడు చాలా ఒత్తిడికి గురయ్యానని నటరాజన్ అంటున్నాడు. నటరాజన్ తన తొలి అంతర్జాతీయ వన్డే మ్యాచ్ డిసెంబ్ 2న కాన్‌బెర్రాలో ఆడాడు. ఆ సమయంలో తన మానసిక స్థితి ఎలా ఉండేదో తెలియజేశాడు. తన స్వగ్రామమైన చిన్నప్పమ్‌పట్టిలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పర్యటనకు సంబంధించి పలు విషయాలు పంచుకున్నాడు. ‘వన్డేలో ఆడటానికి అవకాశం వస్తుందని అనుకోలేదు.

ఈ రోజు మ్యాచ్ ఆడుతున్నావు అని నాకు చెప్పినప్పుడు చాలా ఒత్తిడికి గురయ్యాను. కానీ నా బాధ్యత ఏంటో నాకు తెలుసు. ఈ అవకాశాన్ని ఎలాగైనా ఉపయోగించుకోవాలని అనుకున్నాను. ఇండియా తరపున క్రికెట్ ఆడటం, వికెట్లు తీయడం నా కల. ఇండియా కోసం ఆడుతున్నాననే ఆనందాన్ని నేను మాటల్లో చెప్పలేను. నాకు సహచర క్రికెటర్లు, కోచింగ్ సిబ్బంది నుంచి మంచి మద్దతు లభించింది. నాకు అండగా ఉండటమే కాకుండా నాలో తగినంత స్పూర్తిని నిలిపారు. వాళ్లే లేకుంటే ఇలా రాణించేవాడిని కాదు’ అని నటరాజన్ అన్నాడు. విరాట్ కోహ్లీ, అజింక్య రహానేల కెప్టెన్సీలో ఆడటాన్ని చాలా ఆనందించానని చెప్పాడు. వాళ్లిద్దరూ తనకు మంచి మద్దతు ఇచ్చారని మీడియాకు తెలిపాడు.

Tags:    

Similar News