రానున్న 48 గంటలు బీ అలర్ట్.. ప్రజలకు పోలీసుల విజ్ఞప్తి
దిశ, నర్సంపేట టౌన్/పర్వతగిరి: వాతావరణ శాఖ హెచ్చరిక నేపథ్యంలో రానున్న 48 గంటల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పోలీస్ శాఖ ప్రజలను అప్రమత్తం చేసింది. ప్రజలు ముఖ్యంగా వర్షానికి తడిసిన విద్యుత్ స్తంభాలను తాకకూడదని.. శిథిలావస్థలో ఉన్న ఇళ్లలో ఉండకుండా జాగ్రత్తలు తీసుకోవాలని పోలీసులు సూచించారు. రైతులు బావుల వద్ద మోటర్లు వేసేముందు తడిచిన స్టాటర్ బాక్సులను, ఫ్యూజ్లను చేతులతో తాకరాదని హెచ్చరించారు. వాహనదారులు కల్వర్టులు, బ్రిడ్జిలు, వాగుల్లో నీటి […]
దిశ, నర్సంపేట టౌన్/పర్వతగిరి: వాతావరణ శాఖ హెచ్చరిక నేపథ్యంలో రానున్న 48 గంటల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పోలీస్ శాఖ ప్రజలను అప్రమత్తం చేసింది. ప్రజలు ముఖ్యంగా వర్షానికి తడిసిన విద్యుత్ స్తంభాలను తాకకూడదని.. శిథిలావస్థలో ఉన్న ఇళ్లలో ఉండకుండా జాగ్రత్తలు తీసుకోవాలని పోలీసులు సూచించారు. రైతులు బావుల వద్ద మోటర్లు వేసేముందు తడిచిన స్టాటర్ బాక్సులను, ఫ్యూజ్లను చేతులతో తాకరాదని హెచ్చరించారు. వాహనదారులు కల్వర్టులు, బ్రిడ్జిలు, వాగుల్లో నీటి ప్రవాహం ఎక్కువగా ఉన్నప్పుడు.. వాహనాలతో దాటడానికి సాహసం చేయకూడదన్నారు. అత్యవసర సమయంలో పోలీస్ శాఖ టోల్ ఫ్రీ నెంబర్ 100కి ఫోన్ చేయాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు పోలీసులు.