విద్యుత్ చార్జీలపై సీఎం జగన్‌కు నారా లోకేశ్ బహిరంగ లేఖ

దిశ, ఏపీ బ్యూరో: ప్రజలకు భారంగా మారిన విద్యుత్ చార్జీలను వెంటనే తగ్గించాలని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం సీఎం వైఎస్ జగన్‌కు లోకేశ్ లేఖ రాశారు. విద్యుత్ ట్రూఅప్ చార్జీలను వెంటనే వెనక్కి తీసుకోవాలని సూచించారు. రాష్ట్రంలో కుప్పకూలిన విద్యుత్ రంగాన్ని గాడిన పెట్టాల్సిన అవసరం ఉందన్నారు. తమ ప్రభుత్వం ఏనాడూ విద్యుత్ చార్జీలను పెంచలేదని.. వైసీపీ అధికారంలోకి వచ్చిన రెండున్నరేళ్లలో ఆరుసార్లు విద్యుత్ చార్జీలు […]

Update: 2021-10-11 08:41 GMT

దిశ, ఏపీ బ్యూరో: ప్రజలకు భారంగా మారిన విద్యుత్ చార్జీలను వెంటనే తగ్గించాలని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం సీఎం వైఎస్ జగన్‌కు లోకేశ్ లేఖ రాశారు. విద్యుత్ ట్రూఅప్ చార్జీలను వెంటనే వెనక్కి తీసుకోవాలని సూచించారు. రాష్ట్రంలో కుప్పకూలిన విద్యుత్ రంగాన్ని గాడిన పెట్టాల్సిన అవసరం ఉందన్నారు. తమ ప్రభుత్వం ఏనాడూ విద్యుత్ చార్జీలను పెంచలేదని.. వైసీపీ అధికారంలోకి వచ్చిన రెండున్నరేళ్లలో ఆరుసార్లు విద్యుత్ చార్జీలు పెంచారని ధ్వజమెత్తారు. వైసీపీ పాలనలో విద్యుత్ కోతలు, బిల్లుల వాతలు మెుదలయ్యాయని ధ్వజమెత్తారు.

పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా రూ.26,261 కోట్ల అప్పులు చేసినట్లు లోకేశ్ లేఖలో ఆరోపించారు. ఈ భారాన్ని ట్రూఅప్ చార్జీల పేరుతో లాగేందుకు ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. యూనిట్‌ను గరిష్టంగా రూ.20కు ఎందుకు కొంటున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు. యూనిట్‌కి అదనంగా ఇస్తున్న రూ.16 ఎవరి జేబులోకి వెళ్తోందో ప్రజలకు తెలియజేయాలని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ డిమాండ్ చేశారు.

Tags:    

Similar News