నిరుద్యోగ యువత జాబ్ మేళాను సద్వినియోగం చేసుకోండి:జిల్లా కలెక్టర్

ఆంధ్రప్రదేశ్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న జాబ్ మేళాను నిరుద్యోగ యువతీ యువకులు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ ఏ.ఎస్ దినేష్ కుమార్ పిలుపునిచ్చారు.

Update: 2024-10-04 12:18 GMT

దిశ ప్రతినిధి, పాడేరు: ఆంధ్రప్రదేశ్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న జాబ్ మేళాను నిరుద్యోగ యువతీ యువకులు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ ఏ.ఎస్ దినేష్ కుమార్ పిలుపునిచ్చారు. జాబ్ మేళా గోడ పత్రికను జాయింట్ కలెక్టర్ ఎం, జె. అభిషేక్ గౌడ్, ఐటీడీఏ వి.అభిషేక్, సబ్ కలెక్టర్ సౌర్యమన్ పటేల్‌లతో కలిసి శుక్రవారం ఐటీడీఏ సమావేశాలలో జాబ్ మేళా గోడపత్రికను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ జిల్లా ఉపాధి కార్యాలయం మరియు సీ డా ప్ సంయుక్త ఆధ్వర్యంలో చింతపల్లి యూత్ ట్రైనింగ్ సెంటర్లో అక్టోబర్ 8వ తేదీన (మంగళవారం) ఉదయం 10 గం.ల నుండి సాయంత్రం 3 గం.ల వరకు మూడు కంపెనీలతో జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఈ జాబ్ మేళాలో “అపోలో ఫార్మసీ, నవత రోడ్ ట్రాన్స్పోర్ట్, కేర్ ఫర్ యు తదితర కంపెనీలు పాల్గొంటారని చెప్పారు.

జిల్లాలోని 18-30 సంవత్సరాల మధ్య వయస్సు కలిగిన అభ్యర్థులు హాజరు కావాలని సూచించారు. ఇంటర్మీడియట్,డిప్లొమా, డిగ్రీ , బీటెక్ మరియు ఆపై చదువు పూర్తి చేసిన నిరుద్యోగ యువతీ యువకులు ఇంటర్వ్యూ కు పాన్ కార్డు ,ఆధార్ కార్డు మరియు సర్టిఫికెట్ జిరాక్స్ కాపీలను వెంట తీసుకురావాలని తెలిపారు. ఇంటర్వ్యూ లో ఎంపిక కాబడిన అభ్యర్థులకు నెలకు జీతం 10,000/- నుంచి 20,000 వరకు జీతాలు చెల్లిస్తారని తెలిపారు. ఈ సదవకాశాన్ని జిల్లాలోని నిరుద్యోగ యువతీ యువకులు సద్వినియోగ పరుచుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో డీఆర్ఓ బి.పద్మావతి మహోత్సవం జిల్లా స్కిల్ డెవలప్మెంట్ అధికారి డా.పి.రోహిణి తదితరులు పాల్గొన్నారు. మరిన్ని వివరములకు https://naipunyam.ap.gov.in లేదా 8985832827, 9398338105. సంప్రదించాలని స్పష్టం చేశారు.


Similar News