మొబైల్ యూజర్లకు గుడ్ న్యూస్.. ‘Big C’లో దసరా ధమాకా ఆఫర్స్
రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతం పండగ వాతావరణం నెలకొంది. బతుకమ్మ, దసరా పండుగల నేపథ్యంలో అగ్రశ్రేణి మొబైల్ రిటైల్ విక్రయ సంస్థ బిగ్ సీ(Big C) కీలక నిర్ణయం తీసుకుంది.
దిశ,వెబ్‌డెస్క్: రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతం పండగ వాతావరణం నెలకొంది. బతుకమ్మ, దసరా పండగల నేపథ్యంలో అగ్రశ్రేణి మొబైల్ రిటైల్ విక్రయ సంస్థ బిగ్ సీ(Big C) కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలో దసరా సందర్భంగా ధమాకా ఆఫర్లను ప్రకటించింది. పండగ సీజన్‌లో మొబైల్ కొనుగోలు చేయాలనుకునే వారికి బిగ్ సీ శుభవార్త(Good News) చెప్పింది. ఈ క్రమంలో దసరా సందర్భంగా మొబైల్ వినియోగదారులకు(mobile users) పలు ఆకర్షణీయమైన ఆఫర్లను అందుబాటులోకి తెచ్చినట్లు బిగ్ సీ వ్యవస్థాపకుడు, సీఎండీ బాలు చౌదరి వెల్లడించారు. ప్రతి మొబైల్ కొనుగోలుపై రూ.10,000 వరకు మొబైల్ ప్రొటెక్షన్(Mobile Protection) ఉచితంగా అందించడంతో పాటు రూ.10,000 వరకు తక్షణ క్యాష్‌బ్యాక్‌ను అందించనున్నట్లు ఆయన తెలిపారు. అలాగే రూ.5,999 విలువ గల ఒక కచ్చితమైన బహుమతి(gift) సహా ఎలాంటి వడ్డీ, డౌన్ పేమెంట్ లేకుండానే మొబైల్ కొనుగోలు చేసే అవకాశాన్ని కల్పిస్తున్నట్లు బాలు చౌదరి పేర్కొన్నారు. వీటితోపాటు Oppo మొబైల్‌ను కొనుగోలు చేసిన వారు లక్కీ డ్రా(Lucky draw) ద్వారా రూ.10 లక్షలు నగదు గెలుచుకునే అవకాశం కూడా కల్పించింది.