అది నీచమైన చర్య.. కొండా సురేఖ‌కు కేతిరెడ్డి ప‌రోక్షంగా కౌంట‌ర్‌

తెలంగాణ మంత్రి కొండా సురేఖ‌కు ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి ప‌రోక్షంగా కౌంట‌ర్‌ ఇచ్చారు..

Update: 2024-10-04 14:09 GMT

దిశ, వెబ్ డెస్క్: రాజకీయాల్లో శృతి మించుతున్న వ్యాఖ్యలపై అనంతపురం జిల్లా ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి(Dharmavaram Former MLA Kethi Reddy Venkatarami Reddy) ట్విటర్ ద్వారా స్పందించారు. తెలంగాణ మంత్రి కొండా సురేఖ‌(Telangana Minister Konda Surekha)ను ఉద్దేశించి ప‌రోక్షంగా కౌంట‌ర్‌ ఇచ్చారు. కొండా సురేఖ వ్యాఖ్యలపై హీరో నాగార్జున(Hero Nagarjuna) చేసిన ట్వీట్‌ను ఆయన కోట్ చేసి ట్వీట్‌ పోస్ట్ చేశారు. ప్రజలు రాజకీయాలంటే ఒక చులకన భావంతో చూస్తున్నారని, ఉన్నతమైన పదవిలో ఉన్నవాళ్లు హుందాగా ప్రవర్తించాలని సూచించారు. ఎవరిపై పడితే వారిపై అసభ్యకర వ్యాఖ్యలు చేయడం మంచిదికాదన్నారు. రాజకీయాల కోసం కుటుంబం, వ్యక్తిగత విషయాలను వాడుకోవడం ఒక నీచమైన చ‌ర్య అని కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి పేర్కొన్నారు. 


Similar News