Pavan Kalyan: అదానీ సోలార్ ప్రాజెక్ట్ అంశాన్ని సీఎం పరిశీలిస్తున్నారు.. డిప్యూటీ సీఎం పవన్ కీలక వ్యాఖ్యలు
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ (Deputy CM Pawan Kalyan) ఢిల్లీ (Delhi) పర్యటన బీజీబిజీగా కొనసాగుతోంది.
దిశ, వెబ్‌డెస్క్: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ (Deputy CM Pawan Kalyan) ఢిల్లీ (Delhi) పర్యటన బీజీబిజీగా కొనసాగుతోంది. ఇవాళ ఉదయం ఆయన కేంద్ర మంత్రి భూపేంద్ర యాదవ్ (Bhupendra Yadav)తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఆయన పవన్ కళ్యాణ్ (Pavan Kalyan) కేంద్ర మంత్రికి బొబ్బిలి వీణను బహూకరించారు. అనంతరం ప్రాజెక్టులకు పర్యావరణ అనుమతులపై చర్చించారు. అదేవిధంగా ఎర్రచందనం (Red Sandal Wood) అక్రమ రవాణాపై కూడా చర్చ జరిగింది. భేటీ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. గత ప్రభుత్వం అనేక అవకతవకలకు పాల్పడిందని అన్నారు. అదానీ సోలార్ ప్రాజెక్టు (Adani Solar Project) అంశాన్ని సీఎం చంద్రబాబు (CM Chandrababu) మరోసారి పరిశీలిస్తున్నారని తెలిపారు. ఆ విషయంలో అంతర్జాతీయ స్థాయిలో ఏం జరిగిందనేది తెలుసుకోవాల్సి అవసరం ఉందన్నారు.
రాష్ట్రంలో ఎర్రచందనం (Red Sandal Wood) అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేయాల్సిన అవసరం ఉందన్నారు. రూ.110 కోట్ల ఎర్రచందనం దుంగలను కర్ణాటక (Karnataka)లో దొరికితే వాటిని ఆ రాష్ట్రం వాటిని అమ్మేసిందని అన్నారు. అదే ఎర్రచందనం ఇతర దేశాల్లో దొరికితే తిరిగి తెప్పించుకోవచ్చని అన్నారు. నేపాల్ (Nepal) నుంచి కూడా అలాగే తిరిగి రాష్ట్రానికి ఎర్రచందనం దుంగలను రప్పించామని తెలిపారు. బంగ్లాదేశ్ (Bangladesh)లో హిందువులపై జరుగుతున్న హింస దారుణమని ఆవేదన వ్యక్తం చేశారు. ఆ దేశం భారత సైన్యం త్యాగాలతో ఏర్పడిందని అన్నారు. భారత్‌లో మైనార్టీలను ఎలా చూస్తున్నాం.. అక్కడ మైనార్టీ హిందువులను ఎలా చూస్తున్నారని ప్రశ్నిచారు. పాలస్తీనా (Palestine)లో ఏదైనా జరిగితే స్పందించే ప్రముఖులు, బంగ్లాదేశ్ (Bangladesh)లో జరిగే ఘాతుకాలపై ఎందుకు స్పందించడం లేదని పవన్ ప్రశ్నించారు.