హిందూ ఆలయాలపై దాడులు.. కేంద్రమంత్రి శ్రీనివాసవర్మ హాట్ కామెంట్స్

తిరుమల లడ్డూ వ్యవహారంపై సుప్రీంకోర్టుఇచ్చిన తీర్పును కేంద్రమంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ స్వాగతించారు. ..

Update: 2024-10-04 12:41 GMT

దిశ, వెబ్ డెస్క్: తిరుమల లడ్డూ వ్యవహారం(Tirumala Laddu Affair)పై సుప్రీంకోర్టు(Supreme Court) ఇచ్చిన తీర్పును కేంద్రమంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ(Union Minister Bhupathiraju Srinivasavarma) స్వాగతించారు. లడ్డూ అపవిత్రంపై వాస్తవాలు బయటకు రావాలని, అందుకే ఐదుగురితో కూడిన కమిటీని సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిందని ఆయన తెలిపారు. గత ప్రభుత్వంలో హిందువుల ఆలయాలపై యథేచ్చగా దాడులు జరిగాయని గుర్తుచేశారు. రథాన్ని తగలబెట్టినా, రాముడి విగ్రహం ధ్వంసం చేసినా ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. అప్పటి ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి సైతం తిరుమలలో నిబంధనలు పాటించలేదని మండిపడ్డారు. శ్రీవారికి దంపతులే పట్టువస్త్రాలు సమర్పించాలని శాస్త్రం, ధర్మం చెబుతోందన్నారు. కానీ శ్రీవారికి వైఎస్ జగన్(YS Jagan) ఒక్కరే పట్టువస్త్రాలు సమర్పించారని చెప్పారు. గత ఐదేళ్ల కాలంలో తిరుమల లడ్డూలో కల్తీ జరిగిందని తాము నమ్ముతున్నామని కేంద్రమంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ పేర్కొన్నారు.


Similar News