AP News:‘వారిని విడిచిపెట్టే ప్రసక్తే లేదు’.. బుద్దా వెంకన్న స్ట్రాంగ్ వార్నింగ్

ఏపీలో గత ప్రభుత్వ హయాంలో సోషల్ మీడియా వేదికగా అసభ్యకర వ్యాఖ్యలు చేసిన వారిపై కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది.

Update: 2024-11-24 10:20 GMT

దిశ,వెబ్‌డెస్క్: ఏపీలో గత ప్రభుత్వ హయాంలో సోషల్ మీడియా వేదికగా అసభ్యకర వ్యాఖ్యలు చేసిన వారిపై కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. ఈ క్రమంలో తాజాగా టీడీపీ సీనియర్ నేత బుద్దా వెంకన్న గతంలో అసభ్యకర వ్యాఖ్యలు చేసిన వైసీపీ నేతలకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. వైసీపీ పాలనలో అడ్డగోలుగా వాగిన వారంతా జైలుకు వెళ్లాల్సిందే.. శిక్ష అనుభవించాల్సిందేనని బుద్దా వెంకన్న హెచ్చరించారు. ఈ క్రమంలో ఆయన మాట్లాడుతూ.. వైసీపీ నేతలు కొడాలి నాని, వల్లభనేని వంశీ ఎక్కడ ఉన్నారో కూడా అర్థం కావడం లేదని టీడీపీ నేత బుద్దా వెంకన్న ఎద్దేవా చేశారు. వీరిని అరెస్టు చేసి జైలుకు పంపాల్సిందే అని అన్నారు. గత ప్రభుత్వ హయాంలో నాని, వంశీతో పాటు పోసాని కూడా చంద్రబాబు, లోకేష్ పై అసభ్యకర వ్యాఖ్యలు చేశారని ఫైరయ్యారు. వాళ్లు ఇప్పుడు రాజీపడ్డామని, తప్పైందని, రాజకీయాలు వదిలేస్తున్నామని చెబుతున్నారు. అయినా వారిని వదలొద్దు అని ఆయన వ్యాఖ్యానించారు.


Similar News