AP:‘జగన్ పై విచారణ జరపాలి’.. యనమల రామకృష్ణుడు సంచలన డిమాండ్

విద్యుత్ కొనుగోలు ఒప్పందంలో ముడుపులు అందుకున్న వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పై రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఏసీబీ, సీబీఐ విచారణ జరపాలని మాజీ మంత్రి, ఎమ్మెల్సీ యనమల రామకృష్ణుడు డిమాండ్ చేశారు.

Update: 2024-11-24 09:49 GMT

దిశ ప్రతినిధి,కాకినాడ: విద్యుత్ కొనుగోలు ఒప్పందంలో ముడుపులు అందుకున్న వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పై రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఏసీబీ, సీబీఐ విచారణ జరపాలని మాజీ మంత్రి, ఎమ్మెల్సీ యనమల రామకృష్ణుడు డిమాండ్ చేశారు. ఇది మరో పెద్ద క్విడ్ ప్రో కో డీల్ గా ఆదివారం విలేకరులతో యనమల రామకృష్ణుడు పేర్కొన్నారు. అమెరికా దర్యాప్తు సంస్థ లంచం డబ్బు జగన్ కు చేరిందని తేల్చేసిందన్నారు. ఈ కేసులో అమెరికాలోని అక్కడి దర్యాప్తు సంస్థలు ఏమి చేస్తాయన్నది ఆ దేశంలో కోర్టు తెలుస్తాయని తెలిపారు.

కానీ లంచాలు తీసుకున్నది జగన్, ఆ డబ్బులు చేరింది ఏపీకి, నష్టపోయేది రాష్ట్ర ప్రజలని తెలిపారు. అదంతా ప్రజల సొమ్మని, తక్షణమే దర్యాప్తు సంస్థలతో విచారణ నిర్వహించాలని కోరారు. లంచం డబ్బు తీసుకుని ప్రజలపై భారం మోపేందుకు జగన్ సిద్ధమయ్యారని ధ్వజమెత్తారు. పక్కా ఆధారాలు లభించడంతో రాష్ట్ర ప్రభుత్వం మీన మేషాలు లెక్కించకుండా వెంటనే చర్యలు చేపట్టాలని కోరారు. సీబీఐ దర్యాప్తునకు సిఫార్సు చేయడమా, లేక ఏసీబీ విచారణకు అదేశించడమా అనేది వెంటనే చేయాలని యనమల రామకృష్ణుడు కోరారు.


Similar News