జగన్ సర్కార్‌పై నారా లోకేశ్ ఫైర్
దిశ, ఏపీ బ్యూరో: ఏపీ ప్రభుత్వం చేనేత సోదరులకు తీరని అన్యాయం చేస్తోందని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఆరోపించారు. ‘చేనేత సోదరులకు జాతీయ చేనేత దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన ఆయన మోసపు నేతలో వైఎస్ జగన్ చేయి తిరిగిన కళాకారుడంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో నేతన్నకు ఏడాదికి సుమారు 50 వేలకు పైగా వచ్చే ప్రోత్సాహకాలను, రాయితీలను ఆపేసి… రూ.24 వేలను చేతిలోపెట్టి పండగ చేసుకోమంటున్నారంటూ ట్విటర్ వేదికగా విమర్శించారు. ఆ […]
దిశ, ఏపీ బ్యూరో: ఏపీ ప్రభుత్వం చేనేత సోదరులకు తీరని అన్యాయం చేస్తోందని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఆరోపించారు. ‘చేనేత సోదరులకు జాతీయ చేనేత దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన ఆయన మోసపు నేతలో వైఎస్ జగన్ చేయి తిరిగిన కళాకారుడంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో నేతన్నకు ఏడాదికి సుమారు 50 వేలకు పైగా వచ్చే ప్రోత్సాహకాలను, రాయితీలను ఆపేసి… రూ.24 వేలను చేతిలోపెట్టి పండగ చేసుకోమంటున్నారంటూ ట్విటర్ వేదికగా విమర్శించారు. ఆ రూ.24వేలు కూడా అందరికీ అందడం లేదని చెప్పుకొచ్చారు.
ఆప్కో కొనుగోళ్లు ఆగిపోయాయని చెప్పుకొచ్చారు. సొంతంగా మగ్గం ఏర్పాటుకు రూ.1.5 లక్షల సబ్సిడీ లోన్ ఇవ్వాలని.. ప్రతి చేనేత కార్మిక కుటుంబానికి నెలకు రూ. 10,000 కరోనా సాయం ఇచ్చి ఆదుకొమ్మని ఈ ముఖ్యమంత్రిని ఎన్నో సార్లు అడిగానని కానీ ఏనాడూ పట్టించుకోలేదన్నారు. కనీసం ఇప్పటికైనా వైసీపీ ప్రభుత్వం టీడీపీ డిమాండ్లను పరిశీలించి నేతన్నను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ప్రతీ నేత కార్మికుడికి వైఎస్సార్ నేతన్న నేస్తం పథకంతోపాటు అదనంగా ప్రోత్సాహకాలు, రాయితీలు ఇచ్చి వారిని ఆదుకోవాలని లోకేశ్ డిమాండ్ చేశారు.