కరోనా కంటే ప్రమాదకరం జగరోనా: నారా లోకేశ్

కరోనా కంటే ప్రమాదకరమైన జగరోనా వైరస్ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చెయ్యాలని ప్రయత్నించిందని టీడీపీ నేత నారా లోకేశ్ అన్నారు. దౌర్జన్య పర్వం, అరాచక వాదంతో స్థానిక సంస్థలను వశం చేసుకోవాలని, వ్యవస్థలను భ్రష్టు పట్టించాలని చూస్తున్నారని ఆయన ఆరోపించారు. ఐపీఎస్ అధికారులనే కోర్టు ముందు నిలబెట్టారని లోకేశ్ ఎద్దేవా చేశారు. ఐఏఎస్ అధికారుల బదిలీలకు కారణం అయ్యారని నిందించారు. నియంత ఎన్ని తప్పుడు పనులు చేసినా.. ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవడానికి టీడీపీ పోరాటం చేస్తూనే ఉంటుందని నారా లోకేశ్ […]

Update: 2020-03-15 02:13 GMT

కరోనా కంటే ప్రమాదకరమైన జగరోనా వైరస్ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చెయ్యాలని ప్రయత్నించిందని టీడీపీ నేత నారా లోకేశ్ అన్నారు. దౌర్జన్య పర్వం, అరాచక వాదంతో స్థానిక సంస్థలను వశం చేసుకోవాలని, వ్యవస్థలను భ్రష్టు పట్టించాలని చూస్తున్నారని ఆయన ఆరోపించారు. ఐపీఎస్ అధికారులనే కోర్టు ముందు నిలబెట్టారని లోకేశ్ ఎద్దేవా చేశారు. ఐఏఎస్ అధికారుల బదిలీలకు కారణం అయ్యారని నిందించారు. నియంత ఎన్ని తప్పుడు పనులు చేసినా.. ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవడానికి టీడీపీ పోరాటం చేస్తూనే ఉంటుందని నారా లోకేశ్ ట్విట్టర్ వేదికగా వెల్లడించారు.

Tags: nara lokesh, comments, jagan, twitter

Tags:    

Similar News