Naomi Osaka : మీడియాకు దూరం కానున్న నయోమీ ఒసాకా

దిశ, స్పోర్ట్స్: వరల్డ్ నెంబర్ 2 మహిళా టెన్నిస్ ప్లేయర్ నయోమీ ఒసాకా(Naomi Osaka) ఫ్రెంచ్ ఓపెన్ టోర్నీ ముందు కీలక నిర్ణయం తీసుకున్నది. ఫ్రెంచ్ ఓపెన్ జరిగినన్ని రోజులు తాను మీడియాకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్లు తెలిపింది. మీడియా సమావేశాల్లో పాల్గొనడం వల్ల మానసికంగా భారం పడుతున్నదని, మెంటల్ హెల్త్ పాడవుతున్నదని నయోమీ చెబుతున్నది. ‘చాలా మందికి ఆటగాళ్ల మెంటల్ హెల్త్ గురించి పట్టించుకునే తీరిక ఉండదు. మ్యాచ్ ఓడినా, గెలిచినా చాలా ఒత్తిడితో ఉంటాము. […]

Update: 2021-05-27 10:09 GMT

దిశ, స్పోర్ట్స్: వరల్డ్ నెంబర్ 2 మహిళా టెన్నిస్ ప్లేయర్ నయోమీ ఒసాకా(Naomi Osaka) ఫ్రెంచ్ ఓపెన్ టోర్నీ ముందు కీలక నిర్ణయం తీసుకున్నది. ఫ్రెంచ్ ఓపెన్ జరిగినన్ని రోజులు తాను మీడియాకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్లు తెలిపింది. మీడియా సమావేశాల్లో పాల్గొనడం వల్ల మానసికంగా భారం పడుతున్నదని, మెంటల్ హెల్త్ పాడవుతున్నదని నయోమీ చెబుతున్నది. ‘చాలా మందికి ఆటగాళ్ల మెంటల్ హెల్త్ గురించి పట్టించుకునే తీరిక ఉండదు. మ్యాచ్ ఓడినా, గెలిచినా చాలా ఒత్తిడితో ఉంటాము. ఆ సమయంలో మీడియా సమవేశాల్లో పాల్గొంటే అక్కడి ప్రశ్నలకు మరింత ఒత్తిడికి గురవుతుంటాము. గతంలో అడిగిన ప్రశ్నలను కూడా పదే పదే అడుగుతూ మమ్మల్ని ఇబ్బంది పెడుతుంటారు. అందుకే ఈ కఠిన నిర్ణయం తీసుకున్నాను’ అని నయోమీ సోషల్ మీడియాలో ప్రకటించింది. ఇప్పటి వరకు నాలుగు గ్రాండ్ స్లామ్స్ టైటిల్స్ గెలిచిన నయోమీ ఒసాక.. వరుసగా యూఎస్ ఓపెన్, ఆస్ట్రేలియన్ ఓపెన్ టైటిల్స్ గెలిచింది. తాజాగా క్లే కోర్టులో తన అదృష్టాన్ని పరీక్షించుకోవాలని భావిస్తున్నది. ఫ్రెంచ్ ఓపెన్ మెయిన్ డ్రా మ్యాచ్‌లు మే 30 నుంచి ప్రారంభం కానున్నాయి.

Tags:    

Similar News