హంతకులా? హీరోలా?… ఛాన్స్ మీదే: నాని

కరోనా వైరస్ వ్యాప్తి నివారణకు ప్రభుత్వం అందిస్తున్న సూచనలు పాటించాలని కోరారు నేచురల్ స్టార్ నాని. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రవేశపెట్టిన సేఫ్ హ్యాండ్స్ చాలెంజ్ లో పాల్గొన్న ఆయన…. Covid19 బారిన పడకుండా ఉండాలంటే చేతులను తరుచూ శుభ్రం చేసుకోవాలని సూచించారు. ప్రస్తుతం దేశం ఉన్న పరిస్థితులను అర్ధం చేసుకుని ప్రతీ ఒక్కరూ బాధ్యతగా మెలగాలన్నారు నాని. మాకు కరోనా రావడం ఏంటి? అనే అతి నమ్మకంతో జాగ్రత్తలు పాటించకపోతే ఇతరులకు హాని చేసినవారు అవుతారు […]

Update: 2020-03-22 02:23 GMT

కరోనా వైరస్ వ్యాప్తి నివారణకు ప్రభుత్వం అందిస్తున్న సూచనలు పాటించాలని కోరారు నేచురల్ స్టార్ నాని. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రవేశపెట్టిన సేఫ్ హ్యాండ్స్ చాలెంజ్ లో పాల్గొన్న ఆయన…. Covid19 బారిన పడకుండా ఉండాలంటే చేతులను తరుచూ శుభ్రం చేసుకోవాలని సూచించారు. ప్రస్తుతం దేశం ఉన్న పరిస్థితులను అర్ధం చేసుకుని ప్రతీ ఒక్కరూ బాధ్యతగా మెలగాలన్నారు నాని. మాకు కరోనా రావడం ఏంటి? అనే అతి నమ్మకంతో జాగ్రత్తలు పాటించకపోతే ఇతరులకు హాని చేసినవారు అవుతారు అని వివరించారు. మీ వల్ల ఇతరులకు కరోనా వ్యాప్తి చెంది… అందులో ఒకరో ఇద్దరో వృద్ధులు ఉండి… వారికి ఎలాంటిదైనా ప్రాణహాని జరిగితే హంతకులుగా మిగిలిపోతారని హెచ్చరించారు. మీకు అలాంటి పాపం తగలకుండా ఉండాలంటే సూచనలు తప్పకుండా పాటించాలన్నారు. జీవితంలో ఒక్కసారి మనకు హీరో అయ్యే ఛాన్స్ వస్తుంది… ఇప్పుడు వచ్చింది… మీరెంటో నిరూపించుకోండి అని సూచించారు నాని. ఇందుకోసం మనం చేయాల్సింది కేవలం చేతులు శుభ్రం చేసుకుంటూ ఇంట్లో కూర్చోవడమే. మనకోసం పరిశుభ్రంగా ఉండండి… సురక్షితంగా ఉండండి అని సూచించారు నాని.

Tags: Nani, Covid 19, Coronavirus, Safe Hands Challenge

Tags:    

Similar News