డీసీసీబీ చైర్మన్‌గా గొంగిడి మహేందర్‌రెడ్డి..
దిశ, నల్లగొండ : నల్లగొండ జిల్లా కేంద్ర సహకార బ్యాంక్ చైర్మన్‌గా గొంగిడి మహేందరెడ్డి ఎన్నికయ్యారు. శనివారం డీసీసీబీ ఎన్నిక సందర్భంగా ఎన్నికల కమిటీ ఇన్‌చార్జి ఎమ్మెల్సీ శేరి సుభాశ్‌రెడ్డి ఈ విషయాన్ని ప్రకటించారు. అయితే నల్లగొండ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 109 పీఎసీఎస్ చైర్మన్లు, గ్రేడ్-బి సంఘాల సొసైటీల చైర్మన్‌లు 20మంది డీసీసీబీలో ఓటర్లుగా ఉన్నారు. ఈనెల 25న 20 డైరెక్టర్ స్థానాలకు 25మందిలు నామినేషన్ వేశారు. మంత్రి జగదీశ్వర్‌రెడ్డి చొరవతో 8మంది సభ్యులు నామినేషన్‌ను […]
దిశ, నల్లగొండ :
నల్లగొండ జిల్లా కేంద్ర సహకార బ్యాంక్ చైర్మన్‌గా గొంగిడి మహేందరెడ్డి ఎన్నికయ్యారు. శనివారం డీసీసీబీ ఎన్నిక సందర్భంగా ఎన్నికల కమిటీ ఇన్‌చార్జి ఎమ్మెల్సీ శేరి సుభాశ్‌రెడ్డి ఈ విషయాన్ని ప్రకటించారు. అయితే నల్లగొండ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 109 పీఎసీఎస్ చైర్మన్లు, గ్రేడ్-బి సంఘాల సొసైటీల చైర్మన్‌లు 20మంది డీసీసీబీలో ఓటర్లుగా ఉన్నారు. ఈనెల 25న 20 డైరెక్టర్ స్థానాలకు 25మందిలు నామినేషన్ వేశారు. మంత్రి జగదీశ్వర్‌రెడ్డి చొరవతో 8మంది సభ్యులు నామినేషన్‌ను ఉపసంహరించుకున్నారు. దీంతో 17మంది డైరెక్టర్లు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.మరో 3 డైరెక్టర్ స్థానాలకు ఇద్దరు ఎస్సీ, ఒకటి ఎస్టీకి రిజర్వు కావడంతో అభ్యర్థులు లేనందున ఖాళీగా ఉంచారు.ఏకగ్రీవంగా ఎన్నికైన 17మంది డైరెక్టర్లలో ఒకరు కాంగ్రెస్, 16 మంది టీఆర్ఎస్ డైరెక్టర్లు ఉన్నారు. అధికార పార్టీ నుంచి డీసీసీబీ కోసం దేవరకొండ పీఎసీఎస్ చైర్మన్ ప్రవీణ్‌రెడ్డి, వంగపల్లి పీఎసీఎస్ చైర్మన్ గొంగిడి మహేందర్‌రెడ్డి పోటీపడ్డారు.
జిల్లా ఎమ్మెల్యేలు గొంగిడి పేరును ప్రతిపాదించడంతో సీఎం కేసీఆర్ కూడా అందుకు ఆమోదం తెలిపారు. చైర్మన్ ఎన్నిక బాధ్యతను ఎమ్మెల్సీ షేర్ సుభాష్‌రెడ్డికి అప్పగించడంతో ఆయన డీసీసీబీ డైరెక్టర్‌లతో సమావేశమై అసలు విషయం చెప్పారు. వైస్ చైర్మన్‌గా చిట్యాల మండలం గుండ్రాంపల్లి పీఎసీఎస్ చైర్మన్ ఏసీ రెడ్డి, దయాకర్ రెడ్డి పేరు ప్రకటించడంతో వారు జిల్లా కేంద్ర సహకార బ్యాంకులో చైర్మన్, వైస్ చైర్మన్ పోటీ కోసం నామినేషన్లు దాఖలు చేశారు. మరికొద్ది సేపట్లో డైరెక్టర్ల ఓట్ల ద్వారా వీరి ఎన్నిక లాంఛనం కానున్నది.