డాక్టర్ అవతారమెత్తిన ఎమ్మెల్యే రోజా

దిశ, ఏపీ బ్యూరో : నగరి ఎమ్మెల్యే రోజా పేరు తెలుగు రాష్ట్రాల్లో తెలియనివారు ఎవరూ ఉండరేమో. టాలీవుడ్ సీనియర్ హీరోయిన్‌గా ఓ వెలుగు వెలుగొందిన రోజా.. ఆ తర్వాత రాజకీయాల్లోకి ప్రవేశించారు. సినిమాల్లో ఎలా అయితే సక్సెస్ అయ్యారో రాజకీయాల్లోనూ అలాగే సక్సెస్ అయ్యారు. ఒకపక్క రాజకీయాలు మరోపక్క షోలతో బిజీబిజీగా మారారు రోజా. ఇక రాజకీయాల విషయానికి వస్తే ప్రత్యర్థుల మీద మాటలతూటాలతో రోజా విరుచుకుపడతారు. అందుకే రోజాను ఫైర్ బ్రాండ్ అని పిలుస్తారు. […]

Update: 2021-12-19 05:05 GMT

దిశ, ఏపీ బ్యూరో : నగరి ఎమ్మెల్యే రోజా పేరు తెలుగు రాష్ట్రాల్లో తెలియనివారు ఎవరూ ఉండరేమో. టాలీవుడ్ సీనియర్ హీరోయిన్‌గా ఓ వెలుగు వెలుగొందిన రోజా.. ఆ తర్వాత రాజకీయాల్లోకి ప్రవేశించారు. సినిమాల్లో ఎలా అయితే సక్సెస్ అయ్యారో రాజకీయాల్లోనూ అలాగే సక్సెస్ అయ్యారు. ఒకపక్క రాజకీయాలు మరోపక్క షోలతో బిజీబిజీగా మారారు రోజా. ఇక రాజకీయాల విషయానికి వస్తే ప్రత్యర్థుల మీద మాటలతూటాలతో రోజా విరుచుకుపడతారు. అందుకే రోజాను ఫైర్ బ్రాండ్ అని పిలుస్తారు. ఆమెకు అవకాశం దొరికినప్పుడల్లా నియోజకవర్గంలో పర్యటిస్తూనే ఉంటారు. నిత్యం ప్రజలతో మమేకమవుతూ వారి బాధలు తెలుసుకుంటూ ఉంటారన్న విషయం అందరికీ తెలిసిందే.

రోజా ఏ కార్యక్రమం చేపట్టినా… ఏ కార్యక్రమాన్ని ప్రారంభించినా అందులో ఏదో ఒక వెరైటీ ఉంటుంది. క్రీడలను ప్రారంభిస్తే క్రీడావతారం ఎత్తుతారు. చేనేతలను పరామర్శించినప్పుడు చేనేతగా మారిపోతారు. అంబులెన్స్‌లను ప్రారంభించినప్పుడు అంబులెన్స్ నడుపుతూ డ్రైవర్‌గా మారిపోతారు. ఇక తాజాగా రోజా డాక్టర్ అవతారమెత్తారు. నగరి నియోజకవర్గంలోని పుత్తూరులో ఆదివారం ఉచిత మెగా వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ మెగా వైద్యశిబిరాన్ని ప్రారంభించిన రోజా వైద్యుడి అవతారమెత్తారు. మెడలో స్టెతస్కోప్.. చేతిలో నీడిల్ పట్టుకుంటూ నానా హంగామా చేశారు. అంతేకాదు రోగుల హార్ట్ బీట్ తెలుసుకున్నారు. ఒక రోగికి షుగర్ టెస్ట్ సైతం చేశారు.

ఈ సందర్భంగా రోజా మీడియాతో మాట్లాడుతూ… తన తల్లిదండ్రులకు చిన్నప్పటి నుంచి డాక్టర్ అవ్వాలనే కోరిక ఉండేదని చెప్పుకొచ్చారు. అందువల్లే తాను పద్మావతి కాలేజీలో బైపీసీ గ్రూపు తీసుకుని చదివినట్లు తెలిపారు. తనకు మాత్రం ఎయిర్‌హోస్టోస్ కావాలని ఉండేదని గతాన్ని గుర్తు చేసుకున్నారు. అయితే తల్లిదండ్రుల కోరిక మేరకు బైపీసీ తీసుకుని చదువుతుండగా అనుకోకుండా తనకు సినిమా హీరోయిన్ అవకాశాలు వచ్చినట్లు చెప్పుకొచ్చారు. దాంతో తన జీవితంలో కలగా మిగిలిపోయిన డాక్టర్ కల నేడు ఈ విధంగా నెరవేరిందంటూ రోజా చెప్పుకొచ్చారు.

Tags:    

Similar News