AP Chief Minister:భద్రతను కుదించుకున్న సీఎం చంద్రబాబు.. కారణం ఇదే!
ఏపీ సీఎం చంద్రబాబు(CM Chandrababu) తన భద్రతను కుదించుకున్నారు.
దిశ,వెబ్‌డెస్క్: ఏపీ సీఎం చంద్రబాబు(CM Chandrababu) తన భద్రతను(security) కుదించుకున్నారు. సిబ్బంది స్థానంలో టెక్నాలజీని(Technology) వినియోగించాలని ఆయన నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఉండవల్లిలోని సీఎం చంద్రబాబు నివాసంలో సిబ్బందికి బదులు డ్రోన్(అటానమస్ డ్రోన్ల) సాయంతో పహారా కాయనున్నారు. ఇది కొత్తగా, అనుమానాస్పదంగా ఏది కనిపించినా వెంటనే మానిటరింగ్ టీమ్‌కు సమాచారం చేరవేస్తోంది. మళ్లీ దానికి కేటాయించిన డక్‌పై అదే ఛార్జింగ్ పెట్టుకుంటుంది.
ఈ డ్రోన్ అటనామస్(autonomous) విధానంలో ఆటోపైలెట్‌గా ఆయా ప్రాంతాల్లో ఎగురుతుంది. ఈ డ్రోన్(drone) పంపే డేటాను విశ్లేషించడం ద్వారా ఇంటి పరిసర ప్రాంతాల్లో సెక్యూరిటీని అధికారులు పర్యవేక్షిస్తున్నారు. ఎక్కువ మంది పోలీసులు, సిబ్బంది ఉంటే ఎక్కువ భద్రత ఇస్తున్నట్లు కాదని టెక్నాలజీ సాయంతో తక్కువ మందితో ప్రణాళికతో వ్యవహరించినా మెరుగైన భద్రతా ఏర్పాట్లు చేయవచ్చని సీఎం చంద్రబాబు(CM Chandrababu) నిర్దేశించారు. సీఎం ఆదేశాలతో అధికారులు భద్రతలో(security) సమూల మార్పులు చేశారు. సీఎం చంద్రబాబుకు ప్రస్తుతం 121 మంది భద్రత కల్పిస్తున్నట్లు సమాచారం.