కనీసం గ్లౌజులు కూడా ఇవ్వడం లేదు

దిశ, వెబ్ డెస్క్: ఏపీలో కరోనా వైరస్ విజ‌ృంభణ ఆందోళన కలిగిస్తుందని జనసేన పొలిటికల్ ఎపైర్స్ కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ అన్నారు. రోజుకూ దాదాపు 10 వేలకు చేరువలో కొత్త కేసులు పుట్టుకొస్తున్నాయని ప్రభుత్వం కరోనా కట్టడికి తగిన చర్యలు తీసుకోవటం లేదని విమర్శించారు. ఫ్రంట్ లైన్ వారియర్స్‌గా పేరొందిన వైద్యసిబ్బందికి మౌలిక వసతులు కల్పించడంలో ప్రభుత్వం ఘోరంగా విఫలమైందన్నారు. తెనాలి కోవిడ్ ఆస్పత్రిలో వైద్య సిబ్బంది వెతలు బాధ కలిగించాయని మనోహర్ అన్నారు. ప్రభుత్వం […]

Update: 2020-07-26 05:09 GMT

దిశ, వెబ్ డెస్క్: ఏపీలో కరోనా వైరస్ విజ‌ృంభణ ఆందోళన కలిగిస్తుందని జనసేన పొలిటికల్ ఎపైర్స్ కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ అన్నారు. రోజుకూ దాదాపు 10 వేలకు చేరువలో కొత్త కేసులు పుట్టుకొస్తున్నాయని ప్రభుత్వం కరోనా కట్టడికి తగిన చర్యలు తీసుకోవటం లేదని విమర్శించారు. ఫ్రంట్ లైన్ వారియర్స్‌గా పేరొందిన వైద్యసిబ్బందికి మౌలిక వసతులు కల్పించడంలో ప్రభుత్వం ఘోరంగా విఫలమైందన్నారు.

తెనాలి కోవిడ్ ఆస్పత్రిలో వైద్య సిబ్బంది వెతలు బాధ కలిగించాయని మనోహర్ అన్నారు. ప్రభుత్వం పీపీఈ కిట్లు ఇవ్వకపోవడంతో రెయిన్ కోట్లు వేసుకొని పని చేస్తున్నామని, గ్లౌజులు, శానిటైజర్లు సొంత డబ్బులతో కొనుగోలు చేసుకొంటున్నామని వైద్య సిబ్బంది చెప్పారని అన్నారు.

Tags:    

Similar News