విశాల్ నా తల్లిని దూషించాడు : డైరెక్టర్ మిస్కిన్

దిశ, వెబ్‌డెస్క్: హీరో విశాల్, డైరెక్టర్ మిస్కిన్ మధ్య పచ్చగడ్డేస్తే భగ్గుమనేలా ఉంది. అంత వార్ నడుస్తుంది వీరిద్దరి మధ్య. ఒకరిపై మరొకరు ఆరోపణలు చేస్తూ రచ్చకెక్కిన ఇద్దరు… తుప్పరివాలన్ 2(డిటెక్టివ్ 2) ప్రాజెక్ట్ నుంచి మిస్కిన్‌ బయటకు రావడానికి గల కారణాలను ఎవరికి వారు తమదైన రీతిలో మీడియా ముందు చెబుతున్నారు. మొన్నకు మొన్న మిస్కిన్‌ను ప్రాజెక్ట్ నుంచి తప్పించడానికి గల కారణాలను చెబుతూ విశాల్ ఓ నోట్ రిలీజ్ చేశాడు. మిస్కిన్ అనవరంగా ఖర్చులు […]

Update: 2020-03-13 02:03 GMT

దిశ, వెబ్‌డెస్క్: హీరో విశాల్, డైరెక్టర్ మిస్కిన్ మధ్య పచ్చగడ్డేస్తే భగ్గుమనేలా ఉంది. అంత వార్ నడుస్తుంది వీరిద్దరి మధ్య. ఒకరిపై మరొకరు ఆరోపణలు చేస్తూ రచ్చకెక్కిన ఇద్దరు… తుప్పరివాలన్ 2(డిటెక్టివ్ 2) ప్రాజెక్ట్ నుంచి మిస్కిన్‌ బయటకు రావడానికి గల కారణాలను ఎవరికి వారు తమదైన రీతిలో మీడియా ముందు చెబుతున్నారు. మొన్నకు మొన్న మిస్కిన్‌ను ప్రాజెక్ట్ నుంచి తప్పించడానికి గల కారణాలను చెబుతూ విశాల్ ఓ నోట్ రిలీజ్ చేశాడు. మిస్కిన్ అనవరంగా ఖర్చులు చేస్తూ తలకు మించిన భారంలా ప్రాజెక్ట్‌ను తయారు చేశాడని… నిర్మాత గురించి ఆలోచించకుండా పర్సనల్‌గా చాలా ఖర్చులు చేశాడని చెప్పాడు. ఒక్క కథను రాసేందుకే రూ. 35లక్షలు తీసుకున్నాడని ఆరోపించాడు విశాల్. ఎలాంటి ప్లానింగ్ లేకుండా షూట్ చేసి రూ. 13 కోట్లు వృథా చేశాడన్నాడు. ఒక్క రోజు రెండు సీన్లు తీయాలని.. డే అండ్ నైట్ వర్క్ చేద్దామని కోరినా.. అసలు పట్టించుకోలేదని.. అలాంటప్పుడు ఒక నిర్మాతగా డైరెక్టర్‌‌ను ప్రాజెక్ట్ నుంచి తప్పించడంలో తప్పేముందని .. అసలు అలాంటి దర్శకుడు అవసరమా? అన్నాడు విశాల్. భవిష్యత్‌లో నిర్మాతలు ఇలాంటి పరిస్థితులు ఎదుర్కోకూడదనే ఈ విషయాన్ని మీ ముందుకు తెస్తున్నానని తెలిపాడు.

అయితే దర్శకుడు మిస్కిన్ చెప్పేది మరోలా ఉంది. నేను ఎప్పుడు విశాల్‌ను సోదరుడిగానే చూశానని.. ప్రపంచం మొత్తం తనకు వ్యతిరేకంగా ఉన్నా తన వైపు నిలబడ్డానని తెలిపాడు. తుప్పరివాలన్ సినిమా సక్సెస్ తర్వాత విశాల్‌ను పాన్ ఇండియా స్టార్‌గా నిలబెడతానని అనుకున్నానని తెలిపాడు. ఇందుకోసం కోహినూర్ డైమండ్ నేపథ్యంలో ఒక కథను కూడా విశాల్‌కు వినిపించానని తెలిపాడు. ఈ కథ విన్న విశాల్ ఆనందంతో కన్నీరు పెట్టుకున్నాడని.. సినిమాను తానే నిర్మిస్తానని చెప్పాడని తెలిపాడు. కానీ తుప్పరివాలన్ 2 కథ రాసేందుకు రూ. 35 లక్షలు ఖర్చు చేశానని విశాల్ చెప్పిందంత అబద్ధమని చెప్పాడు మిస్కిన్. ఇందుకోసం కేవలం రూ. 7.5 లక్షలు ఖర్చయిందన్నాడు. కావాలంటే మీడియా ముందు సాక్ష్యాలు చూపిస్తానన్నాడు. ఒక నిర్మాతగా, దర్శకుడిగా నాకు నిర్మాత కష్టాల గురించి తెలుసని అనవసర ఖర్చులు ఎందుకు చేస్తానని వివరించాడు. తుప్పరివాలన్ ప్రాజెక్ట్ కోసం రూ. 3.5 కోట్లు రెమ్యునరేషన్ తీసుకున్నానని… తుప్పరివాలన్ 2 కోసం రెమ్యునరేషన్ పెంచాలని కోరగా… నా తల్లి గురించి నోటికొచ్చినట్లు అసభ్యంగా మాట్లాడడని తెలిపాడు మిస్కిన్. అలాంటప్పుడు అతనితో ఎలా పనిచేయగలనని ప్రశ్నించాడు. అందుకే ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నానని చెప్పాడు.

ఈ విషయంలో నిర్మాతల మండలి, దర్శకుల మండలికి ఫిర్యాదు చేయొచ్చు.. కానీ విశాల్‌ను నేను మనస్ఫూర్తిగా సోదరుడిగా భావించానని అందుకే ఆ పని చేయలేకపోయానని తెలిపాడు మిస్కిన్. కానీ ఇంత జరిగాక కూడా నేను అలా ఉండలేనని చెప్పాడు. తర్వాత జరగబోయే పరిణామాలను ఎదుర్కొంటానని.. తన తప్పు లేదని రుజువు చేసేందుకు ఎంత దూరమైనా వెళ్తానని స్పష్టం చేశాడు.

tags : Mysskin, Vishal, Tupparivalan 2, Detective

Tags:    

Similar News