క్విట్ ఇండియా స్పూర్తితో పని చేయాలి : ఉత్తమ్
దిశ, న్యూస్ బ్యూరో : క్విట్ ఇండియా ఉద్యమ స్ఫూర్తితో పనిచేయాలని టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. క్విట్ ఇండియా 78వ దినోత్సవం సందర్భంగా గాంధీభవన్‌లో కాంగ్రెస్ జెండా ఎగురవేశారు. ఈ సందర్భంగా ఉత్తమ్ మాట్లాడుతూ సాగునీటి విషయంలో తెలంగాణకు తీవ్ర నష్టం జరిగిందన్నారు. తెలంగాణ రాకముందు కృష్ణా జలాల విషయంలో పనికిరాని విషయాలు మాట్లాడి ప్రజల్ని రెచ్చగొట్టారని, సీఎం కేసీఆర్ తెలంగాణను అప్పుల ఊబిలో పడేశారని మండిపడ్డారు. కరోనా కట్టడిలో తెలంగాణ ప్రభుత్వం […]
దిశ, న్యూస్ బ్యూరో : క్విట్ ఇండియా ఉద్యమ స్ఫూర్తితో పనిచేయాలని టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. క్విట్ ఇండియా 78వ దినోత్సవం సందర్భంగా గాంధీభవన్‌లో కాంగ్రెస్ జెండా ఎగురవేశారు. ఈ సందర్భంగా ఉత్తమ్ మాట్లాడుతూ సాగునీటి విషయంలో తెలంగాణకు తీవ్ర నష్టం జరిగిందన్నారు. తెలంగాణ రాకముందు కృష్ణా జలాల విషయంలో పనికిరాని విషయాలు మాట్లాడి ప్రజల్ని రెచ్చగొట్టారని, సీఎం కేసీఆర్ తెలంగాణను అప్పుల ఊబిలో పడేశారని మండిపడ్డారు.
కరోనా కట్టడిలో తెలంగాణ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. వలస కార్మికులకు తెలంగాణ కాంగ్రెస్ సాయం చేసిందని పేర్కొన్నారు. తెలంగాణ ప్రజల అవసరాలు తీర్చేందుకు కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తుందని, జీహెచ్‌ఎంసీ, వరంగల్ కార్పొరేషన్ ఎన్నికలకు సన్నద్ధం కావాలని ఉత్తమ్ పిలుపునిచ్చారు.
కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంతరావు మాట్లాడుతూ పీవీకి భారతరత్న ఇవ్వాలని, కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు విగ్రహాలు పెడుతామని టీఆర్ఎస్ ప్రక. సీఎం కేసీఆర్ నియోజకవర్గంలో బ్యాగరు నర్సింహులు 13 గుంజుకున్న ఈ ప్రభుత్వం పీవీకి విగ్రహాలు పెట్టడం కష్టమేనన్నారు.