తెలంగాణ పోలీస్‌పై కీరవాణి పాట

దిశ, తెలంగాణ క్రైమ్‌బ్యూరో: తెలంగాణ పోలీస్‌పై ప్రముఖ మ్యూజిక్‌ డైరెక్టర్ ఎంఎం కీరవాణి పాడిన పాటను డీజీపీ మహేందర్‌రెడ్డి శనివారం ఆవిష్కరించారు. ఈనెల 21నుంచి 31వరకు పోలీస్ ఫ్లాగ్‌డే సందర్భంగా ఈ పాటను ప్రముఖ గేయ రచయిత అనంత్ శ్రీరామ్ రచించారు. డీజీపీ మహేందర్‌రెడ్డి మాట్లాడుతూ విధి నిర్వహణలో పోలీసులు ఎదుర్కొనే ఇబ్బందులతో పాటు అందించే సేవలను వివరించడం స్ఫూర్తి దాయకం అన్నారు. మనం కష్టపడి సేవ చేస్తుంటే మనతో ఎంతోమంది కలసి వస్తారనడానికి ఈ పాట […]

Update: 2020-10-31 11:17 GMT

దిశ, తెలంగాణ క్రైమ్‌బ్యూరో: తెలంగాణ పోలీస్‌పై ప్రముఖ మ్యూజిక్‌ డైరెక్టర్ ఎంఎం కీరవాణి పాడిన పాటను డీజీపీ మహేందర్‌రెడ్డి శనివారం ఆవిష్కరించారు. ఈనెల 21నుంచి 31వరకు పోలీస్ ఫ్లాగ్‌డే సందర్భంగా ఈ పాటను ప్రముఖ గేయ రచయిత అనంత్ శ్రీరామ్ రచించారు. డీజీపీ మహేందర్‌రెడ్డి మాట్లాడుతూ విధి నిర్వహణలో పోలీసులు ఎదుర్కొనే ఇబ్బందులతో పాటు అందించే సేవలను వివరించడం స్ఫూర్తి దాయకం అన్నారు. మనం కష్టపడి సేవ చేస్తుంటే మనతో ఎంతోమంది కలసి వస్తారనడానికి ఈ పాట నిదర్శనం అన్నారు. కీరవాణి మాట్లాడుతూ మాతృ దేవోభవ, పితృ దేవోభవ, ఆచార్య దేవోభవ అన్నట్టుగానే రక్షక దేవోభవ అనే రోజులు కూడా వస్తాయన్నారు.

Tags:    

Similar News