అమృత, మారుతీ రావు కథ.. మర్డర్

తెలంగాణలో అమృత, మారుతీ రావుల కథ ప్రతీ ఒక్కరికీ తెలిసే ఉంటుంది. మరో కులానికి చెందిన ప్రణయ్ అనే వ్యక్తిని అమృత పెళ్లి చేసుకోగా.. తన భర్తను కాపు కాసి మరీ హత్య చేయించాడు మారుతీ రావు. బిడ్డ కడుపుతో ఉందని తెలిసినా సరే.. అల్లున్ని హత్య చేయించి ఎలాగైనా కూతురిని తన దగ్గరకు చేర్చుకోవాలి అనుకున్నాడు. కానీ కథ అడ్డం తిరిగింది. భర్త చనిపోయిన తర్వాత తండ్రికి ఎదురుతిరిగిన అమృత.. తనను జైలుకు నెట్టింది. కొన్ని […]

Update: 2020-06-21 07:29 GMT

తెలంగాణలో అమృత, మారుతీ రావుల కథ ప్రతీ ఒక్కరికీ తెలిసే ఉంటుంది. మరో కులానికి చెందిన ప్రణయ్ అనే వ్యక్తిని అమృత పెళ్లి చేసుకోగా.. తన భర్తను కాపు కాసి మరీ హత్య చేయించాడు మారుతీ రావు. బిడ్డ కడుపుతో ఉందని తెలిసినా సరే.. అల్లున్ని హత్య చేయించి ఎలాగైనా కూతురిని తన దగ్గరకు చేర్చుకోవాలి అనుకున్నాడు. కానీ కథ అడ్డం తిరిగింది. భర్త చనిపోయిన తర్వాత తండ్రికి ఎదురుతిరిగిన అమృత.. తనను జైలుకు నెట్టింది. కొన్ని రోజుల తర్వాత బెయిల్‌పై తిరిగొచ్చిన తండ్రి ఆత్మహత్య చేసుకోవడంతో కథ ముగిసింది.

ఈ కథను సినిమా రూపంలో తెరకెక్కిస్తున్నట్లు ఇప్పటికే ప్రకటించాడు డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ. ‘ఫాదర్స్ డే’ను పురస్కరించుకుని సినిమా ఫస్ట్ లుక్ రిలీజ్ చేశాడు. ‘మర్డర్ – కుటుంబ కథా చిత్రమ్’ పేరుతో వస్తున్న సినిమాను ఆనంద్ వర్మ డైరెక్ట్ చేస్తుండగా.. నత్తి కరుణ, క్రాంతి నిర్మిస్తున్నారు. ‘బాధతో కూడిన తండ్రుల కథ’ అంటూ ఫస్ట్ పోస్టర్‌ను ఫాదర్స్ డే రోజు విడుదల చేశాడు వర్మ.

Tags:    

Similar News