మూతపడనున్న ముంబై

ముంబై: మహారాష్ట్రలోని ముంబయి సహా మరికొన్ని నగరాల్లో ఆఫీసులు ఈ నెల చివరి(31వ తేదీ) వరకు మూతపడనున్నాయి. అత్యవసరమైన వస్తువులు అమ్మే దుకాణాలు మినహా అన్ని త్వరలో బంద్ కానున్నాయి. ఇప్పటికే చాలా వరకు షాపులు మూతపడ్డాయి. మహారాష్ట్రలో కరోనాకేసులు 52కు చేరడంతో ప్రభుత్వం మరిన్ని కట్టుదిట్టమైన చర్యలకు సిద్ధమైంది. ఇందులో భాగంగానే.. ముంబయి, పూణె, పింప్రి చించ్వాడ్, నాగ్‌పూర్‌లలో అత్యవసర సేవలు మినహా అన్ని ఆఫీసులు మూసేయాలని సీఎం ఉద్ధవ్ ఠాక్రే శుక్రవారం ఆదేశించారు. అలాగే, యాజమాన్యాలు […]

Update: 2020-03-20 05:39 GMT

ముంబై: మహారాష్ట్రలోని ముంబయి సహా మరికొన్ని నగరాల్లో ఆఫీసులు ఈ నెల చివరి(31వ తేదీ) వరకు మూతపడనున్నాయి. అత్యవసరమైన వస్తువులు అమ్మే దుకాణాలు మినహా అన్ని త్వరలో బంద్ కానున్నాయి. ఇప్పటికే చాలా వరకు షాపులు మూతపడ్డాయి. మహారాష్ట్రలో కరోనాకేసులు 52కు చేరడంతో ప్రభుత్వం మరిన్ని కట్టుదిట్టమైన చర్యలకు సిద్ధమైంది. ఇందులో భాగంగానే.. ముంబయి, పూణె, పింప్రి చించ్వాడ్, నాగ్‌పూర్‌లలో అత్యవసర సేవలు మినహా అన్ని ఆఫీసులు మూసేయాలని సీఎం ఉద్ధవ్ ఠాక్రే శుక్రవారం ఆదేశించారు. అలాగే, యాజమాన్యాలు ఉద్యోగుల వేతనాలను నిలిపేయొద్దని సూచించింది. ఇటువంటి సంక్షోభాలు వస్తాయి.. పోతాయి.. కానీ, మానవత్వాన్ని నిలుపుకోండని అన్నారు. ముంబయిలో ప్రభుత్వ కార్యాలయాల్లో కేవలం 25శాతం మంది ఉద్యోగులే విధుల్లో ఉంటారని చెప్పారు.

tags :maharashtra, mumbai, shut, uddhav thackeray, essential, office, employees

Tags:    

Similar News