ముంబయి, జంషెడ్‌‌పూర్ మ్యాచ్ డ్రా

పనాజి: ఇండియన్ సూపర్ లీగ్(ఐఎస్‌ఎల్) 2020లో భాగంగా గోవాలోని జీఎంసీ స్టేడియంలో ముంబయి సిటీ ఎఫ్‌సీకి, జంషెడ్‌పూర్ ఎఫ్‌సీకి మధ్య సోమవారం జరిగిన మ్యాచ్‌ డ్రాగా ముగిసింది. మ్యాచ్‌లో బంతి ఎక్కువ సమయం ముంబయి ఆధినంలోనే ఉన్నప్పటికీ గోల్స్ చేయడంలో విఫలమైంది. ఆట ప్రారంభమైన 9వ నిమిషంలో జంషెడ్‌పూర్‌కు చెందిన ఆటగాడు నెరిజస్ వాల్‌స్కిస్ గోల్ చేయగా, 15వ నిమిషంలో ముంబయి ప్లేయర్ బార్తొలోమ్యూ ఆగ్‌బెచ్ మరో గోల్ చేశాడు. దీంతో ఇరు జట్లు 1-1తో సమంగా […]

Update: 2020-12-14 11:45 GMT

పనాజి: ఇండియన్ సూపర్ లీగ్(ఐఎస్‌ఎల్) 2020లో భాగంగా గోవాలోని జీఎంసీ స్టేడియంలో ముంబయి సిటీ ఎఫ్‌సీకి, జంషెడ్‌పూర్ ఎఫ్‌సీకి మధ్య సోమవారం జరిగిన మ్యాచ్‌ డ్రాగా ముగిసింది. మ్యాచ్‌లో బంతి ఎక్కువ సమయం ముంబయి ఆధినంలోనే ఉన్నప్పటికీ గోల్స్ చేయడంలో విఫలమైంది. ఆట ప్రారంభమైన 9వ నిమిషంలో జంషెడ్‌పూర్‌కు చెందిన ఆటగాడు నెరిజస్ వాల్‌స్కిస్ గోల్ చేయగా, 15వ నిమిషంలో ముంబయి ప్లేయర్ బార్తొలోమ్యూ ఆగ్‌బెచ్ మరో గోల్ చేశాడు. దీంతో ఇరు జట్లు 1-1తో సమంగా నిలిచాయి. నిర్ణీత సమయం ముగిసేవరకు ఇరు జట్లు ఎలాంటి గోల్స్ చేయకపోవడంతో మ్యాచ్‌ డ్రాగా ముగిసింది. కాగా, పాయింట్స్ టేబుల్‌లో అగ్రభాగంలో కొనసాగుతున్న ముంబయి సిటీ ఇప్పటివరకు 6 మ్యాచ్‌లు ఆడగా, నాలుగింట్లో గెలిచింది. ఒక దాంట్లో ఓడిపోగా, ఈ మ్యాచ్‌ను డ్రా చేసుకుంది. జంషెడ్‌పూర్ ఎఫ్‌సీ సైతం 6 మ్యాచ్‌లు ఆడితే, ఒక్క దాంట్లోనే గెలిచింది. మిగతా నాలుగు డ్రా అవ్వగా, ఒక మ్యాచ్‌లో ఓడిపోయింది. పాయింట్స్ టేబుల్‌లో ఈ జట్టు 6వ స్థానంలో ఉంది.

 

Tags:    

Similar News