ఎమిరేట్స్ క్రికెట్‌ లీగ్‌ను వదలని రిలయన్స్, షారుక్ ఖాన్

దిశ, స్పోర్ట్స్: ఎమిరేట్స్ క్రికెట్ బోర్డు ఆధ్వర్యంలో వచ్చే ఏడాది జనవరి నుంచి టీ20 క్రికెట్ లీగ్ నిర్వహించనున్నారు. ఈ లీగ్‌లో పలువురు భారతీయ ఐపీఎల్ ఫ్రాంచైంజీ ఓనర్లతో పాటు ఇతరులు కూడా పెట్టుబడులు పెట్టారు. ముంబై ఇండియన్స్ యాజమాన్యం రిలయన్స్ ఇండస్ట్రీస్, కోల్‌కతా నైట్ రైడర్స్ యజమాని షారుక్ ఖాన్, ఢిల్లీ క్యాపిటల్స్ సహ యజమాని గ్రంధి కిరణ్ కుమార్, మాంచెస్టర్ యునైటెడ్ ఫుట్‌బాల్ క్లబ్ యాజమాన్యం గ్లేజర్స్ ఫ్యామిలీ, ఫైనాన్సియల్ సర్వీసెస్ కంపెనీ కాప్రి, […]

Update: 2021-11-19 09:08 GMT

దిశ, స్పోర్ట్స్: ఎమిరేట్స్ క్రికెట్ బోర్డు ఆధ్వర్యంలో వచ్చే ఏడాది జనవరి నుంచి టీ20 క్రికెట్ లీగ్ నిర్వహించనున్నారు. ఈ లీగ్‌లో పలువురు భారతీయ ఐపీఎల్ ఫ్రాంచైంజీ ఓనర్లతో పాటు ఇతరులు కూడా పెట్టుబడులు పెట్టారు. ముంబై ఇండియన్స్ యాజమాన్యం రిలయన్స్ ఇండస్ట్రీస్, కోల్‌కతా నైట్ రైడర్స్ యజమాని షారుక్ ఖాన్, ఢిల్లీ క్యాపిటల్స్ సహ యజమాని గ్రంధి కిరణ్ కుమార్, మాంచెస్టర్ యునైటెడ్ ఫుట్‌బాల్ క్లబ్ యాజమాన్యం గ్లేజర్స్ ఫ్యామిలీ, ఫైనాన్సియల్ సర్వీసెస్ కంపెనీ కాప్రి, బిగ్ బాష్ లీగ్ ఫ్రాంచైజీ సిడ్నీ సిక్సర్‌కు పెట్టుబడులుపెట్టిన వారిలో ఉన్నారు. మొత్తం 6 జట్లతో ఈ లీగ్ నిర్వహించనున్నట్లు ఎమిరేట్స్ క్రికెట్ బోర్డు చెప్పింది.

ఐపీఎల్ మాజీ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ సుందర్ రామన్ తొలుత ఒక లీగ్‌కు రూపకల్పన చేశారు. యూఏఈ వేదికగా ఒక ప్రైవేట్ లీగ్ నిర్వహించాలని భావించారు. దీనికి సంబంధించిన వివరాలు ముంబై ఇండియన్స్, కోల్‌కతా నైట్ రైడర్స్, చెన్నై సూపర్ కింగ్స్ యాజమాన్యానికి తెలిపారు. దీనికి ఆయా ఫ్రాంచైజీల ఓనర్లు నుంచి మద్దతు లభించింది. అయితే సుందర్ రామన్ రూపొందించిన లీగ్‌ను ఈసీబీ తమ ఆధీనంలోకి తీసుకొని సొంతగా నిర్వహించాలని నిర్ణయించింది. దీంతో చెన్నై సూపర్ కింగ్స్ లీగ్ నుంచి తప్పుకున్నది. కానీ మిగిలిన ఫ్రాంచైజీలు మాత్రం కొనసాగడానికి నిర్ణయించుకున్నాయి. ఇక ఐపీఎల్‌లో ఫ్రాంచైజీ కొనుగోలు చేయడానికి బిడ్ వేసి విఫలమైన గ్లేజర్ ఫ్యామిలీ ఎట్టకేలకు యూఏఈ లీగ్‌తో క్రికెట్‌లోకి అడుగు పెట్టింది.

Tags:    

Similar News