గ్లెన్ మార్క్ క్లినికల్ ట్రయల్స్ సక్సెస్ అయ్యేనా!?

దిశ, వెబ్‌డెస్క్: ఇండియాలో ఔషధ దిగ్గజ సంస్థ గ్లెన్ మార్క్ ఫార్మాస్యూటికల్స్ కొవిడ్-19 నివారణ మందులను తయారు చేయడంలో కీలకమైన అభివృద్ధిని సాధించినట్టు సమాచారం. దీంతో కరోనా చికిత్సకు వాడే యాంటి-రెట్రోవైరల్‌ను అభివృద్ధి చేసిన తొలి ఇండియన్ కంపెనీగా గ్లెన్ మార్క్ అవనుంది. ఈ యాంటి వైరస్ డ్రగ్‌కు సంబంధించిన ఫావిపిరవిర్ కోసం యాక్టివ్ ఫార్మస్యూటికల్ పదార్థాలను గ్లెన్ మార్క్ సంస్థ అభివృద్ధి చేసిందని సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. ఇండియాలో రెగ్యులేటరీ ఆమోదం కోసం దరఖాస్తు చేశామని, […]

Update: 2020-04-23 08:47 GMT

దిశ, వెబ్‌డెస్క్: ఇండియాలో ఔషధ దిగ్గజ సంస్థ గ్లెన్ మార్క్ ఫార్మాస్యూటికల్స్ కొవిడ్-19 నివారణ మందులను తయారు చేయడంలో కీలకమైన అభివృద్ధిని సాధించినట్టు సమాచారం. దీంతో కరోనా చికిత్సకు వాడే యాంటి-రెట్రోవైరల్‌ను అభివృద్ధి చేసిన తొలి ఇండియన్ కంపెనీగా గ్లెన్ మార్క్ అవనుంది. ఈ యాంటి వైరస్ డ్రగ్‌కు సంబంధించిన ఫావిపిరవిర్ కోసం యాక్టివ్ ఫార్మస్యూటికల్ పదార్థాలను గ్లెన్ మార్క్ సంస్థ అభివృద్ధి చేసిందని సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. ఇండియాలో రెగ్యులేటరీ ఆమోదం కోసం దరఖాస్తు చేశామని, ఈ మందు మార్కెటింగ్ అనుమతుల కోసం కూడా ప్రయత్నాలు మొదలుపెట్టినట్టు సంబంధిత వర్గాలు తెలిపాయి. మార్కెటింగ్ ఆమోదం విషయమై డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియాను ఆశ్రయించినట్టు గ్లెన్ మార్క్ స్పష్టం చేసింది. ఇది పూర్తీస్థాయిలో విజయవంతమైతే ఇండియా ఔషధ సంస్థల చరిత్రలో కొత్త అధ్యాయమవుతుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

యాంటీ-రెట్రోవైరల్ ఔషధం కరోనా చికిత్సలో సానుకూల ఫలితాలను చూపించినట్టు అంచనాలు వెలువడ్డాయి. ఈ ఔషధానికి క్లినికల్ ట్రయల్స్ 14 రోజుల నుంచి ఒక నెల రోజులు ఉంటాయని సంస్థ పేర్కొంది. క్లినికల్ ట్రయల్స్ విజయవంతమైతే ఇండియా మార్కెట్లో విడుదల చేయనున్నట్టు జాతీయ మీడియా తెలిపింది. లాగే, ఈ ఔషధాన్ని ఇండియాలోనే అభివృద్ధి చేస్తున్నారని వేరే మార్కెట్లలో చేయట్లేదని సంస్థ స్పష్టం చేసింది. అయితే, ఫావిపిరవీర్‌కు పేటెంట్ లేనందున వేరే సంస్థలు మార్కెట్లోకి వచ్చే అవకాశముందని కంపెనీ వర్గాలు చెప్పాయి. ప్రస్తుతం ఫుజిఫిలిమ్ కంపెనీ ఫావిపిరవిర్ మందును తయారు చేస్తోందని, జపాన్, చైనా దేశాలు కొవిడ్-19 చికిత్సకు దీన్ని ఉపయోగిస్తున్నట్టు తెలుస్తోంది. ఫుజిఫిలిమ్ సంస్థ యూఎస్‌లో ఫావిపిరవిర్ ట్రయల్స్ జరుపుతోంది. ఈ వార్తల అనంతరం గత రెండు సెషన్లలో గ్లెన్ మార్క్ షేర్లు భారీగా 10 శాతం లాభాలతో ట్రేడయ్యాయి.

Tags: coronavirus, Glenmark Pharmaceuticals, shares, Stock market

Tags:    

Similar News