అభివృద్ధి చెందుతున్న రెండో సంస్థగా రిలయన్స్ రిటైల్

దిశ, వెబ్‌డెస్క్: దేశీయ అతిపెద్ద పారిశ్రామికవేత్త ముఖేశ్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ రిటైల్ కంపెనీ ప్రపంచంలోనే వేగంగా అభివృద్ధి చెందుతున్న రెండో సంస్థగా నిలిచింది. డెలాయిట్ విడుదల చేసిన గ్లోబల్ రిటైల్ పవర్ గౌస్ నివేదికలోని జాబితాలో 2021కి గానూ చోటు దక్కించుకున్న ఒకే ఒక భారతీయ సంస్థ రిలయన్స్ రిటైల్ కావడం విశేషం. గతేడాది అగ్రస్థానంలో ఉన్న ఈ సంస్థ ఈసారి రెండో స్థానానికి పరిమితమైంది. గ్లోబల్ పవర్ ఆఫ్ రిటైలింగ్‌లో రిలయన్స్ రిటైల్ గతేడాది […]

Update: 2021-05-09 04:43 GMT

దిశ, వెబ్‌డెస్క్: దేశీయ అతిపెద్ద పారిశ్రామికవేత్త ముఖేశ్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ రిటైల్ కంపెనీ ప్రపంచంలోనే వేగంగా అభివృద్ధి చెందుతున్న రెండో సంస్థగా నిలిచింది. డెలాయిట్ విడుదల చేసిన గ్లోబల్ రిటైల్ పవర్ గౌస్ నివేదికలోని జాబితాలో 2021కి గానూ చోటు దక్కించుకున్న ఒకే ఒక భారతీయ సంస్థ రిలయన్స్ రిటైల్ కావడం విశేషం. గతేడాది అగ్రస్థానంలో ఉన్న ఈ సంస్థ ఈసారి రెండో స్థానానికి పరిమితమైంది. గ్లోబల్ పవర్ ఆఫ్ రిటైలింగ్‌లో రిలయన్స్ రిటైల్ గతేడాది 56వ స్థానం నుంచి ఈ ఏడాది 53వ స్థానానికి మెరుగైనట్టు నివేదిక తెలిపింది.

ఈ జాబితాలో అమెరికాకు చెందిన దిగ్గజం వాల్‌మార్ట్ సంస్థ ప్రపంచంలోనే అగ్రశ్రేణి రిటైల్ కంపెనీగా అగ్రస్థానాన్ని కలిగి ఉంది. అలాగే జాబితాలో అమెజాన్ సంస్థ రెండో స్థానంలో నిలిచింది. అమెరికాకే చెందిన కాస్ట్‌కో హోల్‌సేల్ కార్పొరేషన్ ఆఫ్ యూఎస్ మూడో స్థానంలో, జర్మనీకి చెందిన స్వార్ట్జ్ గ్రూప్ నాలుగో స్థానంలో, అమెరికాకు చెందిన ది క్రోగర్ కో కంపెనీ 5వ స్థానంలో నిలిచాయి. మొత్తం 250 రిటైలర్ల జాబితాలో భారత్ నుంచి జాబితాలో చోటు సంపాదించింది రిలయన్స్ రిటైల్ మాత్రమే. అంతేకాకుండా, వరుసగా నాలుగో సారి జాబితాలో ఈ సంస్థ కొనసాగింది. 2020-21 ఆర్థిక సంవత్సరంలో రిలయన్స్ రిటైల్ వార్షిక ప్రాతిపదికన 41.8 శాతం వృద్ధి చెందినట్టు డెలాయిట్ నివేదిక తెలిపింది. అంతేకాకుండా సంస్థ దుకాణాలు 13.1 శాతం మేర వృద్ధి సాధించాయని, ఎలక్ట్రానిక్, గ్రాసరీ, ఫ్యాషన్, లైఫ్‌స్టైల్ వంటి విభాగాల్లో కంపెనీకి దేశవ్యాప్తంగా 7 వేలకు పైగా పట్టణాలు, నగరాల్లో 11,784 దుకాణాలు ఉన్నట్టు నివేదిక వెల్లడించింది.

Tags:    

Similar News