150 బిలియన్ డాలర్ల కంపెనీగా ఆర్‌ఐఎల్

ముంబయి: రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (ఆర్ఐఎల్) సోమవారం కొత్త రికార్డును సృష్టించింది. 150 బిలియన్ డాలర్ల తొలి భారతీయ కంపెనీగా ఘనత వహించింది. సోమవారం మార్కెట్ ట్రేడింగ్ ప్రారంభం కాగానే బీఎస్‌ఈలో ఆర్‌ఐఎల్ కంపెనీ విలువ రూ.28,249కోట్ల నుంచి రూ.11,43,667 కోట్లకు(150 బిలియన్ డాలర్లు) ఏకబాకింది. ఏదిఏమైనప్పటికీ అదే దూకుడును కొనసాగించలేకపోయింది. ట్రేడింగ్ ముగిసే సమయానికి ఆర్‌ఐఎల్ కంపెనీ విలువ స్వల్పంగా తగ్గిపోయి రూ.11,07,620.56కోట్లు( 145.68 బిలియన్లు)గా స్థిరపడింది. బీఎస్‌ఈ సెన్సెక్స్‌లో ఆర్‌ఐఎల్ షేరు ధర 2.52శాతం […]

Update: 2020-06-22 09:37 GMT

ముంబయి: రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (ఆర్ఐఎల్) సోమవారం కొత్త రికార్డును సృష్టించింది. 150 బిలియన్ డాలర్ల తొలి భారతీయ కంపెనీగా ఘనత వహించింది. సోమవారం మార్కెట్ ట్రేడింగ్ ప్రారంభం కాగానే బీఎస్‌ఈలో ఆర్‌ఐఎల్ కంపెనీ విలువ రూ.28,249కోట్ల నుంచి రూ.11,43,667 కోట్లకు(150 బిలియన్ డాలర్లు) ఏకబాకింది. ఏదిఏమైనప్పటికీ అదే దూకుడును కొనసాగించలేకపోయింది. ట్రేడింగ్ ముగిసే సమయానికి ఆర్‌ఐఎల్ కంపెనీ విలువ స్వల్పంగా తగ్గిపోయి రూ.11,07,620.56కోట్లు( 145.68 బిలియన్లు)గా స్థిరపడింది. బీఎస్‌ఈ సెన్సెక్స్‌లో ఆర్‌ఐఎల్ షేరు ధర 2.52శాతం పెరిగింది. రూ. 1804 వద్ద ట్రేడ్ అయింది. ఎన్‌ఎస్ఈలో ఆల్‌టైమ్ హయ్యెస్ట్ రూ.1804.20కు చేరుకున్నా ట్రేడింగ్ ముగిసే సమయానికి 0.70శాతం తగ్గి రూ.1,747కు చేరుకుంది.

తొలి 10మంది కుబేరుల్లో ఒక్కడు

రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేశ్ అంబానీ సంపద 64.5 బిలియన్ డాలర్లకు చేరడంతో ఆయన ప్రపంచంలోని తొలి 10మంది ధనవంతుల జాబితాలో చోటుసంపాదించినట్టు బ్లూమ్‌బర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ తెలిపింది. ఒరాకిల్ కార్పొరేషన్ అండ్ ఫ్రాన్స్ ఫ్రాంకోయిక్ బెటెన్‌కోర్ట్ మైరిస్‌ను వెనక్కి నెట్టిన ముఖేశ్ అంబానీ 9వ స్థానంలో నిలిచాడు.

Tags:    

Similar News