అర్ధరాత్రులు దర్జాగా బోర్ల దందా.. ఏమీ పట్టని ఎమ్మార్వో..
దిశ,మణుగూరు : మండలంలోని పలు ప్రాంతాలలో ఎలాంటి అనుమతులు లేకుండా ఒక రియల్ వ్యాపారి బోర్లు వేస్తున్నాడు. అర్ధరాత్రులు బోర్లు వేసే విషయాన్ని స్థానిక తహశీల్దార్ దృష్టికి తీసుకువెల్లుతుంటే తహసీల్దార్ ముందుగానే ఎస్కేప్ అవుతున్నడని తెలుస్తోంది. బోర్ల వ్యాపారుల దగ్గర భారీగా ముడుపులు తీసుకోవడం వల్లే ఈ బోర్లదందాను పట్టించుకోవడంలేదని మండల ప్రజలు ఆరోపిస్తున్నారు. మన ప్రాంతంలో కొత్తగా బోరు వేసుకోవాలంటే తహసిల్దార్ అనుమతులు తప్పనిసరని మనకందరికీ తెలిసిందే. నిజానికి భూగర్బజలాల పరిరక్షణ విభాగ అధికారులు బోరు […]
దిశ,మణుగూరు : మండలంలోని పలు ప్రాంతాలలో ఎలాంటి అనుమతులు లేకుండా ఒక రియల్ వ్యాపారి బోర్లు వేస్తున్నాడు. అర్ధరాత్రులు బోర్లు వేసే విషయాన్ని స్థానిక తహశీల్దార్ దృష్టికి తీసుకువెల్లుతుంటే తహసీల్దార్ ముందుగానే ఎస్కేప్ అవుతున్నడని తెలుస్తోంది. బోర్ల వ్యాపారుల దగ్గర భారీగా ముడుపులు తీసుకోవడం వల్లే ఈ బోర్లదందాను పట్టించుకోవడంలేదని మండల ప్రజలు ఆరోపిస్తున్నారు. మన ప్రాంతంలో కొత్తగా బోరు వేసుకోవాలంటే తహసిల్దార్ అనుమతులు తప్పనిసరని మనకందరికీ తెలిసిందే. నిజానికి భూగర్బజలాల పరిరక్షణ విభాగ అధికారులు బోరు వేయాల్సివస్తే స్థలాన్ని పరీక్షించి అనుమతులు ఇస్తారు. కానీ బోర్ల రియల్ వ్యాపారులు అధికారుల అనుమతులు ప్రమేయం లేకుండానే గుట్టు చప్పుడు కాకుండా అర్ధరాత్రులు బోర్లు వేసేస్తున్నారు.
ఈ క్రమంలో మండలంలోని హనుమాన్ టెంపుల్, గౌతమ్ మోడల్ స్కూల్ ముందు గోల్డ్ షాప్ కు సంబంధించిన వ్యక్తికి బోర్ల రియల్ వ్యాపారులు ఎలాంటి అనుమతులు లేకుండా బోరువేశారు. దానిని చూసిన దిశ విలేకరి స్థానిక తహశీల్దార్ కి ఫోన్ చేశారు. అయితే ఆయన స్పందించలేదు. ముందస్తుగానే బోర్ల వ్యాపారులు స్థానిక తహసీల్దార్ తో కుమ్మక్కై బోర్లదందాకు తెరలేపరని ప్రజలు గుసగుసలాడుతున్నారు. ఇప్పటికైనా జిల్లా కలెక్టర్, జిల్లాఅధికారులు స్పందించి పర్యావరణ పరిరక్షణకోసం వెంటనే చర్యలు తీసుకోవాలని మండల ప్రజలు, ప్రజాసంఘాలు, మహిళసంఘాలు, విద్యార్థి సంఘాలు, పలు మేధావులు డిమాండ్ చేస్తున్నారు.