జగిత్యాలలో బ్లాక్ ఫంగస్ కలకలం.. తొలి మరణం నమోదు
దిశ, తెలంగాణ బ్యూరో: తెలంగాణలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. మరీ ముఖ్యంగా ఉమ్మడి కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాలో ఎక్కువ కేసులు నమోదు అవుతున్నాయి. తాజాగా జగిత్యాలలో తొలి బ్లాక్ ఫంగస్ మరణం నమోదైంది. జిల్లాలోని మేడిపల్లి తహసీల్దార్ ఏ.రాజేశ్వర్ హైదరాబాద్లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందారు. నెలరోజుల క్రితం కరోనా చికిత్స నిమిత్తం రాజేశ్ హైదరాబాద్లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేరారు. కరోనా నుంచి కోలుకుని ఇంటికి వచ్చిన తరువాత ఆయనకు బ్లాక్ […]
దిశ, తెలంగాణ బ్యూరో: తెలంగాణలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. మరీ ముఖ్యంగా ఉమ్మడి కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాలో ఎక్కువ కేసులు నమోదు అవుతున్నాయి. తాజాగా జగిత్యాలలో తొలి బ్లాక్ ఫంగస్ మరణం నమోదైంది. జిల్లాలోని మేడిపల్లి తహసీల్దార్ ఏ.రాజేశ్వర్ హైదరాబాద్లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందారు. నెలరోజుల క్రితం కరోనా చికిత్స నిమిత్తం రాజేశ్ హైదరాబాద్లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేరారు. కరోనా నుంచి కోలుకుని ఇంటికి వచ్చిన తరువాత ఆయనకు బ్లాక్ ఫంగస్ సోకింది. దీంతో రాజేశ్వర్ చికిత్స కోసం మళ్లీ అదే ఆస్పత్రిలో చేరి చికిత్స పొందుతుండగా, పరిస్థితి విషమించి సోమవారం ఉదయం తుదిశ్వాస విడిచారు.