అడవుల్లో అగ్గిపుట్టకముందే కామ్‌గా ఉండండి
దిశ, వెబ్‌డెస్క్: బీజేపీ ఎంపీ సోయం బాపురావు మరోసారి వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఏజెన్సీల్లో అక్రమంగా నిర్మిస్తున్న ప్రైవేటు సూళ్లను ఒక నెలలో ఆపకపోతే.. 50 వేల మందితో కలిసి సూళ్లను కూల్చేస్తామని హెచ్చరించారు. అంతేగాకుండా ఆదివాసీల జోలికొస్తే మరో హస్నాపూర్ ఘటన పునరావృతం అవుతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎవరైనా చట్టాలు ఉల్లంఘిస్తే.. ఎంపీగా కాకుండా తుడుందెబ్బ రాష్ట్ర అధ్యక్షునిగా బరిలోకి దిగాల్సి వస్తుందని సూచించారు. ఆదివాసీ […]
దిశ, వెబ్‌డెస్క్: బీజేపీ ఎంపీ సోయం బాపురావు మరోసారి వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఏజెన్సీల్లో అక్రమంగా నిర్మిస్తున్న ప్రైవేటు సూళ్లను ఒక నెలలో ఆపకపోతే.. 50 వేల మందితో కలిసి సూళ్లను కూల్చేస్తామని హెచ్చరించారు. అంతేగాకుండా ఆదివాసీల జోలికొస్తే మరో హస్నాపూర్ ఘటన పునరావృతం అవుతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎవరైనా చట్టాలు ఉల్లంఘిస్తే.. ఎంపీగా కాకుండా తుడుందెబ్బ రాష్ట్ర అధ్యక్షునిగా బరిలోకి దిగాల్సి వస్తుందని సూచించారు. ఆదివాసీ మహిళలపై పెట్టిన అక్రమ కేసులను వెంటనే ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. అడవుల్లో అగ్గిపుట్టకముందే కామ్‌గా ఉండాలని, లేదంటే అంతా బుగ్గే మిగులుతుందని తెలిపారు.