సీఎం జగన్‌కు రఘురామకృష్ణం రాజు మరో లేఖ
దిశ, ఏపీ బ్యూరో: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌కు నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణం రాజు మరో లేఖ రాశారు. ఇప్పటికే నవహమీలు- వైఫల్యాల పేరుతో సీఎం జగన్‌కు తొమ్మిది లేఖలు రాసిన ఎంపీ.. తాజాగా నవ ప్రభుత్వ కర్తవ్యాలు పేరుతో మరో లేఖ రాశారు. రాష్ట్రంలో చాలా మంది ఆకలితో అలమటిస్తున్నారని.. వారందరికీ ఆహారాన్ని అందించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని లేఖలో ప్రస్తావించారు. గత ప్రభుత్వ హయాంలో ఉన్న అన్న క్యాంటీన్ల స్థానంలో జగనన్న క్యాంటీన్లను తెరవాలని […]
దిశ, ఏపీ బ్యూరో: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌కు నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణం రాజు మరో లేఖ రాశారు. ఇప్పటికే నవహమీలు- వైఫల్యాల పేరుతో సీఎం జగన్‌కు తొమ్మిది లేఖలు రాసిన ఎంపీ.. తాజాగా నవ ప్రభుత్వ కర్తవ్యాలు పేరుతో మరో లేఖ రాశారు. రాష్ట్రంలో చాలా మంది ఆకలితో అలమటిస్తున్నారని.. వారందరికీ ఆహారాన్ని అందించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని లేఖలో ప్రస్తావించారు. గత ప్రభుత్వ హయాంలో ఉన్న అన్న క్యాంటీన్ల స్థానంలో జగనన్న క్యాంటీన్లను తెరవాలని కోరారు. ఈ కార్యక్రమాన్ని చేపడితే జగన్‌కు మంచి పేరు వస్తుందని వ్యాఖ్యానించారు. దైవదూత అనే పేరు జనాల్లో స్థిరపడిపోతుందని చెప్పుకొచ్చారు. వీలైనంత త్వరగా జగనన్న క్యాంటీన్ల పథకాన్ని ప్రారంభించి నిరుపేదల ఆకలి తీర్చాలని కోరారు. వైయస్ జయంతి సందర్భంగా జగనన్న లేదా రాజన్న పేరుతో క్యాంటీన్లను ప్రారంభించాలని సూచించారు. పేదల ఆకలి తీర్చే ఈ కార్యక్రమం మానవత్వాన్ని ప్రదర్శించేందుకు మంచి వేదిక అవుతుందని ఎంపీ రఘురామకృష్ణంరాజు సీఎం జగన్ కు లేఖలో తెలిపారు.